వాసుదేవ బలవంత్ ఫడ్కే!అచ్యుతుని రాజ్యశ్రీ

 మహారాష్ట్ర లోని శిరడోనా అనే పల్లెలో కరనాలా అనే దుర్గానికి అధిపతి అనంతరావు ఫడ్కే.ఆంగ్లేయులు దాన్ని వశపర్చుకోటంతోఆయన రైతుగా మారాడు.ఆయన మనవడే వాసుదేవ్! ఈపిల్లాడు ఆంగ్ల సంస్కృతభాషలు యోగ ఆధ్యాత్మిక విషయాల్లో ఆరితేరాడు.మెట్రిక్ పరీక్ష రాయలేదు. మిలటరీ లో చేరాడు.తల్లి భార్య కొడుకు చనిపోటంతో కుటుంబం ఆలనాపాలన కోసం గోణికాబాయిని పెళ్లాడాడు.ఆమె కి కత్తిపట్టడం తుపాకీ పేల్చడం నేర్పాడు.
మహదేవగోవింద రనడే ప్రభావం తో దేశస్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు.1876_77లో ప్లేగు వ్యాధి వ్యాపించింది.వివిధప్రాంతాలు తిరిగి పూనాలోని వ్యాయామశాలలని సంఘటిత పరిచాడు.  శివాజీ దుర్గరక్షకులుగా పనిచేసిన రామోషీ కులంవారిని ఏకత్రాటిపై తెచ్చి రామదండు ని ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులకి విరుద్ధంగా గ్రామాలపై దాడిచేసి ధనం సేకరించి ఆయుధాలు కొని  సైనిక శిక్షణ ఇచ్చాడు. కానీ బ్రిటిష్ వారు వెంటబడి తరమసాగారు.1879లో ఓపత్రిక నెలకొల్పి తనను తాను రెండవ శివాజీగా పరిచయం చేసుకున్నాడు.హిందీ ఇంగ్లీషు  మరాఠీ గుజరాతీ మాట్లాడి ప్రజలతో మమేకమైన ఫడ్కే ను 
మేజర్ డేనియల్ బంధించి  ఏడెన్ కి ఓడలో పంపాడు.
జైలు నించి తప్పించుకునే ప్రయత్నం చేసి  దొరికిపోయాడు.క్షయవ్యాధి తో1883 లో మృత్యువు ఒడిలో ఒరిగిన సాహసి వాసుదేవ ఫడ్కే 🌹
కామెంట్‌లు