పొద్దున్నే హడావిడిగా స్కూల్ కెళ్తున్న రవీంద్ర మాస్టర్ వెంటపడింది కూతురు స్మిత. "నేను కూలా వత్తాబడికి బండి ఎక్కి " అని.
" ఇప్పుడు కాదులేవే!ఆగస్టు 15 తీసుకొని వెళ్తా.!"అంటూ ఉంటే ఏడుపు లంకించుకుంది.
తల్లీ, నానీ తాతయ్యా సముదాయించినా వినలేదు. బట్టలు పీకి పడేసుకుని, కింద పడి దొర్లాడుతూ ఉంటే తాతయ్య ఉపాయం పన్నాడు.
పెరట్లో కపిల గోవు దగ్గరికి తీసుకొని వెళ్లి... "ఇదిగో నీ బండి "అని లేగ దూడని చూపించగానే..., ఏడుపు మాని చెంగునవెళ్లి దూడపైన కూర్చుని ఫోటో కి ఫోజు ఇచ్చింది స్మిత!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి