రాజేశ్వరరావు చండ్ర .(1915-1994);- తాటి కోల పద్మావతి

 అవిశ్రాంత విప్లవ యోధుడైన రాజేశ్వరరావు ని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సి ఆర్ గా పిలుచుకుంటారు. ఈయన కృష్ణాజిల్లా మంగళాపురంలో 1915లో కలవారి కుటుంబంలో జన్మించాడు. బందరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివి తర్వాత ఎంబిబిఎస్ రెండేళ్లు చదివి కమ్యూనిస్టు భావాలకు లోనై చదువు నుంచి మార్క్ స్ట్ సిద్ధాంతాలు అధ్యయనం కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆచార్య నరేంద్ర డేల్ సన్నిధిలో మార్కిస్ట్ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి 1942లో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. వీరు తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య గారితో కలిసి పని చేశారు. కమ్యూనిస్టు పార్టీ 1964 లో రెండుగా చీలినప్పుడు సిపిఐ కార్యదర్శిగా 1989 వరకు పాతిక సంవత్సరాలు పనిచేశారు. చల్లపల్లి జమీందారీ భూములను రైతుల పరం చేయడంతో విశాలాంధ్ర నిర్మాణంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణంలో వీరుని వలే కృషి చేశారు. వీరి నిరంతర సేవలకు గుర్తింపుగా సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ లెనిన్ గౌరవంతో సత్కరించింది. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించిన వీరు 1994లో పరమపదించారు. వీరి అభిమానాలు అనుచరులు వీరి మరణానంతరం సి ఆర్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ అనే సంస్థను హైదరాబాదు కేంద్రంగా స్థాపించారు.
.
కామెంట్‌లు