ప్రతిభా మూర్తులు. ఆరుద్ర (1925-1998);- తాటి కోల పద్మావతి.

 సాహితీ పరిశోధకుడు, కవి విమర్శకుడు, కధకుడు సినీ రచయిత అయిన వీరి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. మహాకవి శ్రీశ్రీకి దగ్గర బంధువు. వీరు విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్ర నక్షత్రంలో వీరికి నామకరణం జరిగిందట. అందువల్ల ఈ పేరుతో ఆయన రచనలు చేసి తెలుగునాట సుప్రసిద్ధుడు అయ్యాడు. 1942లో వైమానిక దళంలో చేరారు. మూడేళ్లకే ఉద్యోగం మాని చెన్నై చేరారు. కమ్యూనిస్టు భావాలు ఆయన్ని అమితంగా ఆకర్షించాయి.
ఆనందవాణి, డంకా పత్రికలకు వ్యాసాలు కవితలు రాశారు. 1948లో హైదరాబాదు నుండి వస్తూ ఒక దిగంబర స్త్రీని చూసి విచలీతుడై'త్వమే వాహం'అనే కావ్యం వ్రాశారు. దీనికి శ్రీ శ్రీ పీఠిక వ్రాశారు. 19 51 లో సౌదామిని అనే చిత్రానికి మాటలు రాసి ప్రసిద్ధి చెంది ఇక మద్రాసులోనే స్థిరపడ్డారు. రెండు దశాబ్దాలు గేయా సినిమా పాటలు రాశారు. వేమన పై ఆసక్తికర పరిశోధనలు చేశారు. 1965లో సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రకు నుడికారం చుట్టి 1968 లో పూర్తి చేశారు. ఇవే కాక ఇంటింటి పద్యాలు, కూనలమ్మ పదాలు అనే వచన గేయాలు ఇతని కవిగా నిలబెట్టాయి. వీరు 1998లో శాశ్వతంగా కన్నుమూశారు. వీరి సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని తెలుగు అకాడమీ 4 సంపుటాలుగా ప్రచురించి వీరిని గౌరవించింది. వీరి సతీమణి రామలక్ష్మి కూడా ప్రముఖ రచయిత్రి. ఎన్నో నవలలు వ్రాశారు.

కామెంట్‌లు