దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (47);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉమ్మడి ఆస్తిపై అందరికీ సమాన అధికారం ఉంటుందనే విషయం మీకు చెప్పనవసరం లేదు అన్నీ తెలిసినవారు ఇంతకంటే ఏమీ చెప్పలేం  అనగానే వెంగళరెడ్డిలో ఆలోచనలు నిజమే తన పూర్వీకుల సంపదపై తనతో పాటు తన రక్తం పంచుకు పుట్టిన వారికి హక్కు ఉంది వారి హక్కును హరించడం నేరమవుతుంది. ఈ ఆలోచన కలగగానే వెంగళ రెడ్డి మనస్సు ఆక్రోశించింది  మర్నాడు ఉదయమే తమ్ములందరిని పిలిచి తన నిర్ణయం చెప్పాడు వెంగళ రెడ్డి ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్నాము కాబట్టి నాకాలోచనే కలుగలేదు ఏది ఏమైనా మీకు చెందవలసిన  అణా పైస తగ్గకుండా చెందటం న్యాయం ఆ న్యాయాన్ని విస్మరించినందుకు నన్ను మన్నించండి  అనగానే మన్నించండి అన్న మాట వినగానే తమ్ముళ్లు అందరి ముఖాల వంక మరొకరు చూసుకున్నారు  వెంగళరెడ్డి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు. వెండి ఆభరణాలు కాక మన జమీ మొత్తంలో చాలా పాపం అమ్మేశాను ఇక మిగిలింది 1000 ఎకరాలు ఈ వేయకరాల్లో 500 ఎకరాలు నా తమ్ముళ్లకు నా పెంపుడు కొడుకు 250 ఎకరాలు  ఇక మిగిలిన 250 ఎకరాల్లో నా భార్యలకు చేరి వల్ల ఎకరాలు నాకు 50 ఎకరాలు పంచుతున్నాను  అనగానే అందరూ సమ్మతంగా తలలూపారు ఇచ్చిన బంగారు పథకం తమ్ముడు ఈశ్వర్ రెడ్డి తీసుకున్నాడు. అన్న వద్దే ఉంటే దాన్ని కూడా ఎవడికైనా దానం చేయడంతో  చేస్తాడేమోనన్న భయంతో  ఆస్తి పంపకాలు జరిగినా వెంగళ రెడ్డి జారపణలో ఎలాంటి మార్పు రాలేదు. హైకోర్టు జూరీ సభ్యులుగా నియమించబడ్డ వెంగళరెడ్డి జూరీ సభ్యులను విప్పించి ఎంతో మంది నిరపరాధులను విడుదల చేయించాడు  అతని వాదనలు అర్ధవంతంగా ఉండడం వల్ల మిగతా జ్యూరీ సభ్యుడు కూడా అతనిని అభినందించేవారు ఇలాంటి తరుణంలో ఓ రోజు  తలారి నరసింహం వచ్చి చెప్పాడు దివిటీల మల్లిగాడిని పోలీసులు పట్టుకున్నారు  కడప జైల్లో కొన్నాళ్లు వుంచి మద్రాస్ జైలుకు తీసుకెళ్లారట త్వరలో కేసు విచారణకు వస్తుందట తన అనుచరులలో డబ్బు ఆశలో పడి పోలీసులకు పట్టుబడి ఎలా చేశారట  నరసింహ మాటలు విన్న వెంగళరెడ్డి చిన్నగా బాధపడుతూ చెప్పారు మన వెంటనే మద్రాస్ వెళ్ళాలి ప్రయాణానికి ఏర్పాటు చేయి చిత్తం అంటూ వెళ్ళబోతున్న నరసింహాని అడిగాడు వెంగళరెడ్డి  డబ్బు విషయం ఏం చేశావు నరసింహ అని తమరు చెప్పినట్లుగానే ఐదు ఎకరాలు అమ్మి వేశాను. రుక్కం తెచ్చాను దివణా దగ్గర ఉంచాను అనగానే మంచిది. నువ్వు ఇక వెళ్ళు అన్నాడు రెడ్డి.


కామెంట్‌లు