ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్-9247593432
 తే.గీ
సత్యమైనట్టి దృష్టితో సరళముగను
వీక్షణంబును గావించ వివరణుండు
కష్టమైనట్టి పనులెల్ల నిష్టముగను
చేయ సాగేవు స్థిరమైన చేవతోడ
తే.గీ
దూర దృష్టితో యోచించి జారిపడక
నిశ్చలంబుతో యోచించ నిజము దెలియు
కలవరంబైన చింతలో ఫలితమునకు
స్థిరముగా యోచననుజేయ చెదరవెపుడు

కామెంట్‌లు