పంచపది, - ఆహారం ఆరోగ్యవర్ధనం!; - డా.పి.వి.ఎల్.సుబ్బారావు ,94410 58797.
నా పంచపదుల సంఖ్య--

849.

ఆహార భద్రత బతుకునకిచ్చు, ఘన ఆరోగ్యము !

ఆరోగ్యంతో బతికినన్నాళ్లు, నిత్యం ఆనందోత్సవము! 

"శరీరంధర్మసాధనం" ,ఆరోగ్యం,
ఆయువులేమూలము!

సరి ఆహారంతోనే కలుగు, ఆరోగ్య మహాభాగ్యము! 

ఇన్ పుట్ బట్టి ఔట్ పుట్,
 కంప్యూటరే జీవితము,
పివిఎల్!

850.

ఆహార భద్రత ,
మన అందరి కర్తవ్యము! 

కర్తవ్యరాహిత్యం,
 జనఆరోగ్యం కల్లోలము! 

అనారోగ్య జీవనమే, మోయలేని భారము!

భారమైన జీవనం,
తిరుగులేని శాపము!

 ఆహారకల్తీతో,అందరికీ, సుస్తీయోగం, పివిఎల్!

851. 

ఆహార కల్తీ నాశనం, మహోద్యమం కావాలి!
 
వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు ముందుండాలి! 

ఇది అందరి సమస్య ,
ఒక్కటై నడవాలి!

 చట్టాలు కఠిన శిక్షలు ,
అమలు చేయాలి!

" కల్తీ లేని కూడు"
   నడుంబిగించి,
          సాధిద్దాము, పివిఎల్!
________


కామెంట్‌లు