సద్వినియోగం చెయ్యాలి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇవాళ సమాజంలో మనం రకరకాల వ్యక్తులను  వారు చేసే కార్యక్రమాలను గమనించినట్లయితే  ఆ గ్రామానికి గాని పట్టణానికి గాని కావలసిన పనిని  రోడ్డు వెయ్యడానికి గుడి కట్టడానికి విద్యాలయాన్ని స్థాపించడానికి అన్న వంక పెట్టి  దానికి కావలసిన  వనరుల కోసం  అక్కడ ఉన్న ధనవంతుల వద్దకు వెళ్లి విషయాన్ని సక్రమంగా చెప్పి  దానికోసం సహకరించమని  దానం చేసి పుణ్యం కట్టుకోమని  వారి వద్ద వసూలు చేస్తారు  అలా వసూలు చేసిన ధనంతో  ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత  దానికి కావలసిన  అవసరాల కోసం  మరి కొంతమంది సహకారం తీసుకొని  వారి వద్ద మరి కొంత ధనాన్ని సేకరించి  ఆలయానికి కావలసిన అన్ని  అలంకారాలతో పాటు కార్యక్రమాలు పూర్తి చేస్తారు
ఇవాళ సమాజంలో దానిని వ్యాపారాత్మకంగా  మలచి  ఆ కార్యక్రమాల పేరుతో ధనాన్ని  సేకరించడం  దానిని  సొంత పనులకు ఉపయోగించుకోవడం  తన అప్పులను తీర్చుకోవడానికి కానీ స్థలాలు కొనుక్కోడానికి కానీ  తన గృహానికి కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి కానీ  ఉపయోగిస్తూ ఉన్నటువంటి వాళ్లను  చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం  కానీ వారిని ఏమీ అనడానికి  ఎందుకు ఈ తప్పు చేస్తున్నావ్ అని నిలదీయడానికి  ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు  అలా మసి పూసి మారేడు కాయ చేసే వ్యక్తులను మనం  చూసి మనసులోనే వీడు ఇంత నీచ బుజ్జి కలిగిన వాడా అనుకొని  ఇలాంటి వెదవలు వల్లనే సమాజం నాశనం అయిపోతుందని ఎవరికి వారు లోలోపలే అనుకుంటారు కానీ  బయటపడరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వేమన  ఒక చక్కటి సూచన  ఆట వేలాది పద్యంలో మనకు తెలియజేశారు  ఇతరులు చేసిన దానధర్మాలను  సద్వినియోగం చేసి ఏఏ కార్యక్రమాల కోసం వారు నిధులను పోగు చేశారు  ఆ పనిని చేసిన వారు  మంచి మనసుతో  మంచి కార్యాన్ని చేసిన ప్రతి ఒక్కరికి  తమ సొంత ఆస్తి దానంతట అదే పెరుగుతుంది కానీ  అదే వృధా చేస్తూ  వంద రూపాయలు ఖర్చు చేసి వెయ్యి రూపాయలు  గా చూపే రాతలతో  మోసం చేసే వారి జీవితంలో కష్టపడి సంపాదించుకున్న తన సొంత ఆస్తి కూడా  ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం నాశనం అయిపోతుంది  కనుక ఎలాంటి మోసాలకు పాల్పడవద్దు అని నీతిని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకు అందించారు మీరూ చదవండి.

"పరుల దత్తమునకు పాలన జేసిన నిల స్వదత్తమునకు నినుమడించు  నవని పరుల దత్తమపహరించిన స్వదత్తంబు నిష్ఫలంబు ధరణి వేమ..."కామెంట్‌లు