బాలలూ...మీరు నాతో రండి - కోరాడ నరసింహా రావు.. !
బొంగరానికి తాడును చుట్టి 
. సర్రు మంటూ నేలకు కొట్టి.. 
  గిర - గిరా దాన్ని తిప్పేద్దామా!
   పందెంలో మనం గెలిచేద్దామా

 రెండు వెదురు పుల్లలను ...
   రంగుల కాగితానికి కట్టి  
  గాలి పటాన్ని తయారు చేసి 
   బారెడు తోకను తగిలించి 
    కర్రకు దారం చుట్టి ఆ గాలి పటానికి కట్టి... 
     పోటీలో నేర్పుగ ఎగురవేసి 
 బహుమతి మనము కొట్టేద్దామా... !

పాత నోట్సులో కాగితాలతో... 
  పడవలను తయారుచేసి.. 
   చూరున జారిన వర్షపు నీటిలో.. 
  పందానికి మనం వదలుద్దామా..., 
   మనమే గెలిచి, అందరి చేతా 
చప్పట్లను కొట్టిద్దామా... !!
..  బాలలూ మీరు నాతో రండి 
పోటీ ఆటలు ఎన్నెన్నో ఆడిస్తాను !
    మీ మోముల్లో నవ్వుల పువ్వులు పూయిస్తాను !!

కామెంట్‌లు