శాస్త్రం లేదా చరిత్ర!!!- ప్రతాప్ కౌటిళ్యా -శ్రావణీ
నీళ్లను వేడి చేస్తాం
కానీ ఆవిరి కానివ్వం!

నీళ్లను చల్లబరుస్తాం
కానీ గడ్డ కట్టనివ్వం!!

గాలిని అంతా పీలుస్తాం
కానీ ప్రాణవాయువు మాత్రమే
తీసుకుంటాం!!!!

ఎగురాల్సింది
పక్షి అనుకున్నాం ఇన్నాళ్లు
కానీ మనము ఎగిరాం!!!

ఎర్రగా ఉంటేనే రక్తాన్ని గుర్తుపడతాం
కానీ రక్తం నీలిరంగులో కూడా ఉంటుంది!!

స్వర పేటిక స్మశానంలో
పాటల్ని పూడ్చిపెట్టాం
మాటల్ని కాల్చాం
కానీ నాలుక ఇంకా మిగిలి ఉందని
మర్చిపోతున్నాం!!!!!!?

కుడి ఎడమల్లో
ఏ కాలు గొప్పదో ఎవరో తేల్చాల్సిన అవసరం లేదు!!!

కుడి ఎడమల్ల మెదళ్లలో
ఏది గొప్పదో ఎవరు నోరు మెదపాల్సిన అవసరం లేదు ఇప్పుడు!!!!!?

సరిగ్గా నే ఉన్నాయి
ఎవరి పని వాళ్లు చేస్తూ పోతున్నారు!!
సాంకేతిక లోపం వల్ల
కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
వాళ్లకు సమయం దొరికింది!!!!?

తీగల్లో ప్రవహించాల్సింది-విద్యుత్తు
నరాల్లో ప్రవహించేది విద్యుతే అని తెలుసుకున్నాం!!!?

ఆకలి గొంటే 
కడుపు మండుతుందేమో గాని
నరాలు కూడా చిట్లిపోతాయి!!

కోపం వస్తే
రక్తం మరుగుతుందేమో కానీ
గుండె కూడా ఆగిపోతుంది!!!!?

జాగ్రత్తగా విను
ఏ చెవితో విన్నావు అన్నది ముఖ్యం!!!
జాగ్రత్తగా చూడు
ఏ కన్నుతో చూస్తున్నావ్ అన్నది ముఖ్యం!!!

విద్యుత్తు
శబ్దాన్ని చిత్రాన్ని సృష్టించినట్లు
నీ మెదడు చెప్తోంది!!?

సరిగ్గా అక్కడ
సంతోషం దుఃఖం యుద్ధం కూడా చేస్తుంది!!

మనుషులుంటేనే
మజా వస్తుంది!!!!
మనిషి లేని ఆవిష్కరణలు
పరిశోధనలు అన్నీ పనికిరానివే!!!

హార్మోనుల రొమ్ములు ఇచ్చే
పాలకోసమే
పసిపాపలు పడిచస్తారు ఏడుస్తారు!!!?

భారత రామాయణ భాగవతాల
పేర్లు మారుద్దామా!!!!!?

అవి మానసిక శాస్త్రాలని మరువద్దు!!!

ఒప్పుకుంటే
శాస్త్రాలు లేదంటే పవిత్రా చరిత్రలు!!!?

యూఎస్ఏ లో ఎంఎస్ చదువుతున్న శ్రావణి కోసం.

Pratap Kautilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏 8309529273.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది మీ కవిత్వం నాకైతే కొత్త లోకంలో విహరించినట్లు అనిపించింది.