సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -168
భూమి రథిక న్యాయము
******
భూమి అంటే,పృథివి,మట్టి, ప్రదేశము, చోటు, స్థితి పుడమి,అవని,నేల,ధరణి, ధరిత్రి మొదలైన అర్థాలు కలవు.
రథిక అంటే రథమెక్కి పోవు వాడు, రథము పై నుండి యుద్ధము చేయువాడు అనే అర్థాలు కలవు.
రథము పై నుండి యుద్ధము చేయుట నేర్పే ఆచార్యుడు లేదా గురువు తన శిష్యులకు మొదట నేలపై ఓ రథం బొమ్మ గీస్తాడు. ఆ గీతలలో  శిష్యుని నిల్చోబెట్టి నేర్పుతాడు.అలా శిష్యుడు రథములో నుండి యుద్ధము చేయుచున్నట్లు భావిస్తూ నేర్చుకుంటాడు.ఆ తర్వాత యుద్ధరంగములలో మహా రథికుడై  విజయం సాధించే నైపుణ్యాన్ని పొందుతాడు.
ఇలా  గురువు కనుసన్నల్లో రథ యుద్ధం ఊహిస్తూ నేర్చుకోవడాన్ని భూమి రథిక న్యాయము అంటారు  .
ఏ విద్య అయినా సరే నేర్చుకోవడానికి గురువు అవసరమనీ,గురువు నేర్పాల్సిన విషయానికి సంబంధించి ఎలాంటి బోధనా వ్యూహాన్ని అమలు పరుస్తాడో, బోధనాభ్యసన సన్నివేశాన్ని  కల్పిస్తూ  విద్యార్థులకు అవగాహన చేస్తాడో ఈ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యను అభ్యసించడానికి గురువు ఎంత ముఖ్యమో రాసిన ప్రజాకవి వేమన గారి పద్యాలను చూద్దాం.
"గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో /అజునికైన వాని యబ్బకైన/తాళపు చెవి లేక తలుపెట్లూడునో?/ విశ్వధాభిరామ వినురవేమ!"
తాళము చెవి లేకుండా తలుపు తాళం ఏ విధంగా రాదో అదే విధంగా గురువు శిక్షణ లేకుండా బ్రహ్మ కానీ అతని తండ్రి కానీ జ్ఞానాన్ని  పొందలేరు" అంటారు.
అలాగే మరో పద్యం
"వాక్కు నందు గురువు వాక్రుతాను గురువు/చీకటి నటు గురుడు చిక్కి యుండు/ అఖిలమునకు గురువు యాధారమై యుండు/ విశ్వధాభిరామ వినురవేమ!"
మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి ఉంది. మాటల శక్తిలో గురువు యొక్క ప్రభావం ఉంది.మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కోవడానికి ఆధారభూతమైన వాడు గురువే. ఈ లోకంలో ఏ పని నేర్చుకోవాలి అనుకున్నా గురువు తప్పకుండా ఉండాలి. గురువు లేనిది ఏ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అంత తొందరగా దరి చేరవు. సంపూర్ణమైన అవగాహన కలుగదు. అందుకే ఏది నేర్చుకోవాలనుకున్నా గురువే ఆధారం.
 భూమి రథిక న్యాయము ద్వారా మనం ఉత్తమమైన గురువు ఏ విధంగా విజ్ఞానం,విషయ పరిజ్ఞానం  విద్యార్థుల్లో నింపుతాడో  తెలుసుకున్నాం. అంతే కాదు నైతిక విలువలను పాటించేలా చేసేది కూడా గురువేనని అర్థం చేసుకోగలిగాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం