సేంద్రీయ వ్యవసాయం ప్రాశస్త్యం; - :సి.హెచ్.సాయిప్రతాప్
 సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణింపవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది . నేలపై లేదా భూమిపై పైరు వ్యర్ధపదార్ధాలను కప్పడం వలన నేలను సూర్యరశ్మి , గాలి మరియు వర్షపు నీటి కోత నుండి ఎటువంటి ఆర్ధిక నష్టం లేకుండా, మట్టిని ఎంత మాత్రం నష్టపోకుండా సంరక్షింప వచ్చును. తద్వారా మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
గత ముప్ఫై సంవత్సరాలలో పురుగు మందుల వాడకం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడి, అధిక లాభాల పేరుతో వీటిని విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు.. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా.. ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోవదం లేదు. వీటి వాడకం వల్ల ఎన్నిసత్పలితాలు వచ్చాయో.. అంతకు మించి దుష్పలితాలను చవి చూసారు. చూస్తూనే ఉన్నారు. మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి, పండే పంట పూర్తిగా కలుషిత మయమయ్యాయి. నిత్యం అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నాము.
సేంద్రీయ వ్యవసాయం, ప్రామాణిక వ్యవసాయంతో పోల్చినప్పుడు, చిన్న పురుగుమందులను తీసుకుంటుంది, నేల కోతను తగ్గిస్తుంది, నైట్రేట్ లీచేట్‌ను ఉపరితలం మరియు భూగర్భ జలాల్లోకి తగ్గిస్తుంది మరియు జంతువుల ఎరువును తిరిగి పొలంలోకి రీసైకిల్ చేస్తుంది. ఈ ప్రయోజనాలు అధిక వినియోగదారు ఆహార ఖర్చులు మరియు మొత్తం తక్కువ దిగుబడితో భర్తీ చేయబడతాయి.
ముఖ్యంగా భూసారాన్ని పెంచే వానపాములు పూర్తిగా అంతరించి పోయే స్టేజిలో ఉన్నాయి. తేనె టీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే దిశగా సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ నిపుణులు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

కామెంట్‌లు