. మందు గుండు లేని తోపులు--కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం
సమాజం ఒక మహోన్నత వ్యవస్థ
దాని కెప్పుడూ ఏదో ఒక అవస్థ!!
దాని బాగు కోసం కావాలి చికిత్స
కవి కలంతో చేయాలి శస్త్ర చికిత్స !!

చీమలు పెట్టిన పుట్ట సమాజం
అదే శ్రమైక జీవుల సౌందర్య సౌధం,
కొల్లగొట్టే విష నాగుల ఆక్రమణం
ఎదిరించి నిలువరించే అక్షర కణం !!

బడుగు బలహీన వర్గాల బతుకు
ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు 
సిరాగ్ని వర్షం కురిపించి సరిదిద్దే
సమరయోధుడు కలం కదనంలో సదా సదాశివుడు!!

కండకావరంతో అమ్మలను చెరిచి విరిచి
తొడలు చరిచి అత్యాచారం చేసే తోడేళ్ళను
మెడలు నరికి తలపులు కొరికి
కడలు దింపే కలం పట్టిన కవి!!

మోసం దగా దోపిడీ దొంగతనం
మీసం మెలేసి కాలు దువ్వుతుంటే,
రోషం దట్టించి తూటా ఎక్కించి
ట్రిగ్గర్ నొక్కించే డ్రెడ్జర్ !!


కాలం ఏదైనా కల్మషాలను కడిగి
సమయం ఏదైనా సమస్యలను విప్పి
సందర్భానుసారంగా సమాజాన్ని
సమన్వయ పరిచే సంధానకర్త కవి!!

;

కామెంట్‌లు