పాముల పల్లె!అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత  అడిగాడు "ఏంచేశారు మీరు బడిలో?" పిల్లలు అన్నారు "కాసేపు కబుర్లు చెప్పుకున్నాం.కొత్త టీచర్ భలే తమాషా విశేషాలు చెప్పింది తాతా ". శివా అన్నాడు "తాతా! మహారాష్ట్ర లో శేత్ఫల్ అనే పల్లెలో భలే విచిత్రం. "సాయి అందుకున్నాడు"షోలాపూర్ జిల్లా లో పూణె కి200కి.మీ.దూరం లో ఆపల్లె ఉంది. విషపూరితమైన పాములు కోబ్రాలకు ఆపల్లె ఆవాసం.అందరిఇంట్లో ఎంచక్కా  ఇవి హాయిగా కుటుంబ సభ్యుల లాగా  పాకుతూ తిరుగుతాయి.వాటికి  కడుపు నిండా తిండి పెడతారు.పిల్లలు భయంలేకుండా ఆడుకుంటారు.   మనుషుల కన్నా పాములసంఖ్యే ఆపల్లెలో అధికం.అవి ఎవరినీ కాటువేయకపోటం ఇంకా విచిత్రం. ప్రతి ఇంట్లో కోబ్రా కి ప్రత్యేకంగా పూజామందిరం ఉంటుంది. " ఆవిషయాలు అంతానోరు తెరుచుకుని ఆశ్చర్యంగా విన్నారు.  తాత అన్నాడు "అవును పిల్లలూ! అందరికన్నా మనిషి కి నిలువెల్ల విషం.పాముకన్నా మనిషి ప్రమాదకారి."🌹
కామెంట్‌లు