మృగశిర కార్తె;-: కె.కవిత: హైదరాబాద్.
రోహిణి  కార్తె ముగిసెను
మృగశిర  కార్తె ప్రవేశించెను
భానుడి ప్రతాపం కొనసాగెను
చూడచక్కని తెలుగు సున్నితంబు

హలాలు చేతబట్టి రైతులు
వరుణుడి రాకకై ఎదురుచూపులు
తొలకరితోనే  పనులు మొదలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఉబ్బసవ్యాధికి చేప మందు
ప్రభుత్వంచే ఉచితంగా అందు
రోగులు ఉపశమనం పొందు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అధికమగు చేపల ధరలు 
లాభాల బాటలో వ్యాపారులు
అయినా కొనెదరు మాంసాహారులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అనంత కాల భ్రమరంలో
రవంత జీవన పయనంలో
సాగాలిగా బ్రతుకు నావలో
చూడచక్కని తెలుగు సున్నితంబు  కామెంట్‌లు
Raghunandan kurudi చెప్పారు…
చాలా బాగుంది....ఇది విన్న తరువాత భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు