సుప్రభాత కవిత ; - బృంద
ఎంత సుందరమైనదీ
రంగురంగుల వసుమతి
నింగి కూడా నిలిచి చూసే
దైవమొసగిన బహుమతి

తూరుపు గిరుల గంభీరం
గిరుల దూకె ఝరుల రవం
పచ్చని లోయల సోయగం
ముచ్చటగ తోచే పచ్చదనం

కొండల తాకుతూ తేలిపోయే
పాలమబ్బుల పరవశం
రంగులు నిండి పండగలా
నిండైన గగనపు అతిశయం

చంటిపిల్లలు కేరింతగ ఊపే
పాదాలల్లే .గాలికి ఊగే పైరులు
పచ్చని పైటేసిన పల్లెపడుచులా
గట్టున నిలిచిన తరువులు

వరుసన విరిసి మురిసిపోతూ
నవ్వులు రువ్వే పువ్వులతో
రంగురంగుల రెక్కలతో స్వేచ్చగ
ఎగిరే  సీతాకోకచిలుకల సందడితో

అలరారే  జగతి అందాలు వర్ణింప 
భాషలున్నవా? మాటలున్నవా?
అసలింతకన్న సౌందర్యం 
దివిని మాత్రం ఉండునా?

సహజ సౌందర్య ప్రకృతికి
వెలుగులు అద్దే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు