తెలంగాణ ఆత్మకథ!!;- ప్రతాప్ కౌటిల్య
తొలకరి చినుకు మట్టి పరిమళం మా తెలంగాణ!!
ఆకుకు ఆకలేస్తే వెలుగును తినిపించిన తొలి తెలంగాణ మాది!!

నిజాలు తాజాగా ఉండాలి కానీ పాతిపెట్టిన శవాల్ని పరీక్ష కోసం మళ్లీ తవ్వినట్టు ఉండకూడదు.!!

ఆరోగ్యం ఆహారం అమ్మానాన్నల వైద్యం విద్య 
అక్కచెల్లెళ్ల ఉండి అవసరం సహాయం సమితి పోరులా  కాక
 సీతా సావిత్రిలా సాగిపోతున్న తెలంగాణ మాది!!!

ఇంద్రుని అధికార దండం మాయల పకీరు మంత్రదండం ఒకటేనా?
అల్లావుద్దీన్ అద్భుతదీపం ఆలీబాబా నలబై దొంగలు ఒకటేనా!?
ఊరికో ఎర్రకోట వీధికో కుతుబ్మినార్ కట్టడం అంటే రాజులు కట్టిన కోట బురుజులు కాదు

రాష్ట్రానికి కోటి చార్మినార్లు కట్టిన కాలం మాది.!!!

తవ్వకాల్లో నాగరికతలు చరిత్రలు బయటపడ్డట్లు
నగరాల్లో ఊర్లలో నాగరీకులు జనాలు భయం వీడి
నిర్భయంగా నిద్రిస్తున్న చరిత్ర మాది!!!

నిప్పుల వానలు కురిసినట్లు ఆనవాళ్లు
అగ్నికి బలైన భూములు తలంటు స్నానం చేసినట్లునీరు ఏరు ఊరు నిండుకుండలా
చల్లగా పచ్చగా చమరుస్తున్నది ఇప్పుడు!!

పీల్చే గాలి వీచే గాలి ఒకటై ఏటికి ఎదురీదే తెరచాపలై
ప్రతి పల్లె చాప పిల్లల ప్రతి పిల్ల పిల్ల గాలిలా
సముద్రమంతా కలియ తిరుగుతుంది.

పూర్వం నదులపై నాగరికతలు వెలసిన వి
ఇప్పుడు నదులు సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం లా నడివీధుల్లో పారుతున్నవి!!!!

నగరానికో సూర్యుడు ఊరుకో చంద్రుడు వీధికో నక్షత్రం
రాత్రి పగలు రాజ్యమేలుతున్నవి!!?

గుహల్లో పులులు సింహాలున్నట్లు గృహాల్లో గబ్బిలాలు ఉన్నట్లు గుర్తు
గరీబులకు గదులు కాదు
తలా ఓ  తాజ్ మహల్ నిర్మించిన చరిత్ర మాది!!

నాగజముడులు ఎడారుల్లో గులాబీల వయాసిస్సులు కాదు
సరస్వతీ సరస్సులు నిర్మించిన తెలంగాణ మాది!!!
కంటి చూపు ఒకటే కాదు ఇంటికో ఉద్యోగం
కంప్యూటర్ ఒకటే కాదు డిజిటల్ తెలంగాణ మాది!!!!

అడవుల్లో పులులు సింహాలు ఉంటాయి కానీ
తెలంగాణ వాడ వాడ ఒక అడవి
అక్కడ ఆడవాళ్లే పులులు సింహాలు
నిప్పు నీరు ఇప్పుడు ఆత్మీయులు
ఆత్మహత్యలు లేవు ఇప్పుడు
ఇది తెలంగాణ ఆత్మకథ...........!!!!?

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సాహితి ఉత్సవ దినం సందర్భంగా రాసిన కవిత.

Pratap Kautilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏 8309529273.

కామెంట్‌లు