థామస్ ఆల్వా ఎడిసెన్;- కొప్పరపు తాయారు

 తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసెన్ జూనియర్.తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్.
         అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి చెందిన
మిలన్ అనే ప్రాంతంలో జన్మించారు.పెరగడం మిషిగాన్. రాష్ట్రం లో పోర్టు హ్యూరాన్ అనే ప్రదేశంలో పెరిగారు.ఇతడు ఏడుగురు సంతానం లో
ఆఖరి వాడు.
        ఒకరోజు పాఠశాలలో చదువు కుంటున్నప్పుడు 
ఒక ఉత్తరం తెచ్చి తల్లికి ఇచ్చి గట్టిగా చదువ మన్నాడు.
      కన్నీళ్ళు ధారాపాతంగా కారుతూంటే .మీ కుమారుడు ఒక జీనియస్.అద్బతమైన తెలివి తేటలు కలవాడు.అయితే ఇతనికి చెప్పేంత జ్ఞానం
ఉన్న టిచర్లు లేక పోవడం‌ వల్ల మీరు ఇంటి వద్దే
చదివించండి అని.అమ్మ చదివింది కన్నీళ్ళ తో.
           దానికి ఎందుకమ్మా బాధ అని అంటే
కాదు నాన్న సంతోషం.అని నవ్వేసింది .పిచ్చి తల్లి.
         ఆ పట్టుదలతో తాను టీచరు అవడం వల్ల
ఎంతో ప్రేమగా అభిమానం తో చదివించింది.అందుకే
అంత గొప్ప వాడు అయ్యాడు.శాస్త్రవేత్తగా ఎదిగ
గలిగాడు .
    అమ్మా ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నో పుస్తకాలు
చదివాడు. 12 ఏళ్ళ వయసులోనే పేపరు ప్రచురించిన ఘనత.
     తాను పెద్దవాడయ్యాక చిన్నప్పుడు తాను అమ్మకి
ఇచ్చిన చదివించిన చీటీ చూచి చాలా బాధ పడ్డాడు
ఎందుకంటే మీ వాడికి చదువు రావడం చాలా కష్టం
అందుకు మీ అబ్బాయి నీ మీరు తీసుకుని ఇంటిలో
చదివించండి అని అది అమ్మ చదివిన దానికి పూర్తి
వ్యతి రేకం. చాలా చాలా బాధపడ్డాడు అమ్మ ఎంత
బాధ పడిందో అని.
             కానీ ఈ రోజు ఇంటింటా వెలుగు నిలుస్తున్న
దివ్యజ్ఞాన జ్యోతి గా వెలుగు తున్నాడు.
కామెంట్‌లు