శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండే‌పండిత్ అంటే విద్వాంసుడు విద్య లోనిష్ణాతుడు శాస్త్రం లో ఘనాపాటి అని అర్థం.సంస్కృతంలో అనేక పరిభాషలు న్నాయి.ఆత్మగ్నానం ఆధ్యాత్మిక గ్నానం కలవాడు.
సద్ అసద్ వివేకినీబుద్ధి పండా సంజాతాయస్య పండిత:
దీని అర్ధం ఏమంటేసద్ అసద్‌వివేకం బుద్ధి ని పండా అంటారు.ఆబుద్ధి వివేకం విచక్షణ గలవాడు పండితుడు.
తనతో సమానంగా సంపూర్ణ జీవులను మన్నించేవాడు దార్శనికుడు కూడా పండితుడు.ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సఃపండితః
సంస్కృతం లో పండిత్ ప్రాకృతం లో పణ్ణిత హిందీ లో పాండేయ్ మరాఠీలో పాండే గుజరాతీ లో పాండ్య.కొంతమందిప్రగ్న నించి పండిత పదం వచ్చింది అని అంటారు.గాంధారదేశం ప్రాకృత భాష నించి ఇది పుట్టింది.పండిత అనే పదంబృహదారణ్యక ఛాంద్యోగపనిషద్ లో కన్పడుతుంది పణ్ణిత  గా ఉచ్చరించేవారు.ధమ్మపదంలో కూడా ఇదే పదం.ఉపనిషత్తులకు పూర్వంఈపదంలేదు.1249_50బెండెగిరి తామ్రపత్రాల్లో ఉపనామంగా ఉంది.రాష్ట్రకూటులు  కల్యాణి చాళుక్యుల కాలంలో పండిత్ పదం వాడుక లో ఉంది.ఛత్రపతి శివాజీ అష్టప్రధాన్ లలో పండితరావ్ అనే అధికారి ఉండేవాడు.ధర్మసంబంధ సలహాలు ఇచ్చే వాడు.మరాఠీలోపాండే అంటే పన్ను వసూలు చేసే అధికారి.ఇంకోఅర్ధం లేఖకుడు అని.మహారాష్ట్రలో వారి స్థాయిని బట్టి గావ్ పాండే ఘాట్ పాండే దేశ్పాండే పాంఢరీపాండే బుధపాండేపాంచ్పాండే బారాపాండే అనే పేర్లతో పన్నులు వసూలు చేసే వారు.బ్రాహ్మణకులాన్ని సూచించే పదం ఇది.వంటవారిని కూడా పండిత్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. నేడు అప్పడాలు తయారు చేసే వారిని కూడా పండిత్ అంటున్నారు 🌹
కామెంట్‌లు