వనజ శతకము (అట వెలదులు )- ఎం. వి. ఉమాదేవి
 101)
కవనసీమలోని కరుణాo తరంగమ్ము
నవరసములతోడ నటనమాడి
చిన్నిపద్యములను చెక్కితి శిల్పినై 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
102)
గతముదలచి వగచ ఘనతేమిరాబోదు
పొరుగువారితోడ పోటివలదు
సమయపాలనమ్ము సాధించు వృద్ధియున్ 
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
103)
శ్రద్ధయుండినపుడు శ్రమలేమిగలుగవు 
చేయుకార్యమందు చేటురాదు
శకునములను నమ్మి శంకలేలవిజూడ 
వనజమాట మిగుల వాస్తవమ్ము!
104)
సత్వగుణముగల్గు సత్యమార్గము సాగి
తామసమునునొదిలి తననెరింగి
రాజసమున మెలిగి రక్షణల నివ్వాలె
వనజ మాట మిగులవాస్తవమ్ము !

కామెంట్‌లు