ముసుగు ముచ్చట్లు - ఎస్ మౌనిక


 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ. మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే! ఈరోజు మీరు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంకో  కొత్త ఆసక్తికరమైన విషయాన్ని మీ నేస్తం మీ ముందుకు తెచ్చేసింది. ముసుగు వేసుకుంటే చలి తగ్గుతుంది కదా! దీని వెనుక ఉన్న చిన్న కిసుక్కు ఏంటో  మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చల్లగాలి ప్రవహిస్తున్నప్పుడు మనం ముసుకు వేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. చల్లగాలి వస్తున్నప్పుడు ముసుకు రంధ్రాలు ఎంత పెద్ద వైనప్పటికీని మొత్తం గాలిని లోపలికి పంపలేవు. దీంతో ముసుకు బయట వేడిగాలి పుడుతుంది. దీంతో మనకు వెచ్చగా అనిపిస్తుంది. ముసుకు బయట ఉన్న వేడి గాలిని, చల్లగాలి ద్వారా పంపించవచ్చు కదా! అని మీకు సందేహం కలగవచ్చు. కానీ దానికి ముసుగు అడ్డుపడుతుంది.  అందువల్ల వేడిగాలి అక్కడే ఉంటుంది. కింద ఇచ్చిన చిత్రాన్ని గమనించడం ద్వారా మీకు ఇంకా స్పష్టం అవుతుంది. ఇంత చిన్న విషయంలోనే ఇంత సంగతి ఉందా అని మీకు అనిపిస్తుంది కదా! సేమ్ ఫీలింగ్ నాది కూడా! ఓకే మై డియర్ ఫ్రెండ్స్! మళ్లీ త్వరలో ఇంకో కిసుక్కుతో మీ నేస్తం మీ ముందు ఉంటుంది. ఉండనా మరి? బాయ్!
కామెంట్‌లు