చరిత్ర చెప్పిన సత్యం (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 " తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు?" అన్న మహాకవి శ్రీశ్రీ నిజమైన క్రాంతిదర్శి. బహుళార్థసాధక జలసౌధాల నిర్మాణంలో రాళ్ళెత్తిన బక్కచిక్కిన బడుగుకూలీల పేర్లేమన్నా రాసిపెట్టుకున్నామా? స్వతంత్రభారత సంగ్రామంలో తమ సర్వస్వాన్ని ధారపోసి పోరాడిన అశేష జనవాహిని పేర్లేమన్నా ఉన్నాయా? దాదాపు ఏడుదశాబ్దాలపాటు పరాయిపాలనలో మగ్గిన వీరతెలంగాణా విమోచనానికి పాటుపడిన అనామక త్యాగమూర్తుల పేర్లేమన్నా గుర్తున్నాయా? గతంలో ఎన్నో సామ్రాజ్యాలు రాజ్యాలు నిర్మించారు, గెలుచుకున్నారు, విస్తరించారు. అందులో ముఖ్యభూమిక పోషించిన సైనికుల పేర్లెక్కడైనా రాసి ఉంచారా? చక్రవర్తులు, రాజులు, మంత్రులు, నాయకమ్మన్యులు వారి తాబేదార్ల పేర్లే నిల్చిఉంటాయి. అంతేకాని, నిజమైన శ్రమవీరులు, త్యాగధనులు అనామకులుగానే ఉండిపోతారు. ఇది చరిత్రచెప్పిన సత్యం కదా!!!

+++++++++++++++++++++++++


కామెంట్‌లు