చిన్నిబాల పదాలు ;- పి. చైతన్య భారతి
చల్లని ఈ వెన్నెల 
చిరునవ్వుల ఊయల 
కలకాలముండాల 
ఓ చిన్నిబాల !

పరుచుకున్న వెన్నెల 
విరజాజి సుమబాల 
ఆస్వాదనుండాల
ఓ చిన్నిబాల !

వనదేవత అందం 
పరవశాన డెందం 
ఇల పరమానందం 
ఓ చిన్నిబాల !

అనుబంధ పొదరిల్లు 
కలిసుంటె విరిజల్లు 
ప్రేముంటెనే చెల్లు 
ఓ చిన్ని బాల !

మూర్ఖత్వపు జనాలు 
శూలమంటి మాటలు 
విరిచేయు హృదయాలు 
ఓ చిన్నిబాల !


కామెంట్‌లు