వందేమాతరం! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత అడిగాడు "వందేమాతరం రాసినది ఎవరు?""ఓహ్! అదికూడా తెలియదా తాతా? బంకించంద్ ఛటర్జీ "."మరి వందేమాతరం ని ఇంటిపేరు గా మార్చుకున్న దేశభక్తుడెవరు? ఆయన మన తెలంగాణా వాడే!" పిల్లలంతా బిక్కమొహం వేసి "తెలీదు తాతా!ఆయన్ని గూర్చి చెప్పవు?" అని ముద్దు గా  అడిగారు."ఆ! ఆయన గద్వాల దగ్గర ఉన్న క్యాటూర్ అనే పల్లెలో 1917లో పుట్టారు. నిజాం పాలనలో హైదరాబాద్ మగ్గుతున్న రోజులవి. 1938 లో ఆబిడ్స్ సెంటర్ లో కొందరు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అంతేవారిని చంచల్ గూడ జైల్లో పడేశారు. వావిలాల రామచంద్రరావు అనే విద్యార్థి ని గన్ గురిపెట్టి పోలీసులు బెదిరించారు " నీవు ఆపాట పాడితే చంపేస్తాం" అతను ఏమాత్రం బెదరలేదు.  అంతే24లాఠీ దెబ్బలు శిక్ష పడింది. అతని దుస్తులు విప్పి ఓపీటమీద నిలబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు.   లాఠీతో దావూద్ అనేవాడు కొట్టాడు.మొదటి దెబ్బకు రామచంద్రరావు  బెదరక "వందేమాతరం " అన్నాడు. అంతే రక్తం కారేలా ఆదుష్టుడు 24సార్లు  చావచితకబాదినా ఆయన ఆపలేదు.ఈయనతోపాటు లాఠీ దెబ్బలు తిన్న వారు రాంలాల్ మోతీలాల్ చనిపోయారు.ఆసాహసి వావిలాల రామచంద్రరావు జైలు నించి విడుదల ఐనాక సావర్కార్ ఆయన్ని వందేమాతరం రామచంద్రరావు అని పిలవటం తో ఆపేరు స్థిరపడింది. హైదరాబాద్ నవాబు స్వతంత్ర రాజ్యంగా ఉంటానని భీష్మించాడు.అంతే సర్దార్ పటేల్ కె.ఎం.మున్షీకి నిజాం కీలక సమాచారం అందించారు ఈయన. అలా నిజాం ఆటకట్టించటంలో కీలకపాత్ర పోషించారు వందేమాతరం రామచంద్రరావు గారు. శాసనసభ కి ఎన్నికై అప్పటి ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గా పనిచేసి న ఆయన 2001లో అమరులైనారు.ఇలాంటి మహానుభావులగూర్చి అందరూ తెలుసు కోవాలి "." నిజం తాతా! మాకు ఇప్పుడే తెల్సిందే ఆయన గొప్ప తనం" అంటూ వందేమాతరం రామచంద్రరావు తాత గారి కి జేజేలు అని అరవసాగారు🌹
కామెంట్‌లు