విచిత్ర రాజు!;- - బోగా పురుషోత్తం.

  మాళవిక రాజ్యాన్ని మాళవికుడు అనేరాజు పరిపాలించేవాడు. అతని రాజ్యంలో విచిత్ర పరిస్థితులు వుండేవి. వేసవికాలంలో కుండపోత వర్షం కురిసేది. పంట కాలువలు, వాగులు, వంకలు ప్రవహించి రైతులను, ప్రజలను అతలాకుతలం చేసేది. పండిo చిన పంటలన్నీ నీటిపాలై ప్రజలు, రైతులు ఆహారం లేక అల్లాడిపోయేవారు. కరువు తాండవించాల్సిన సమయంలో వరదలు ప్రవహించి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారేది.
  వర్షాకాలంలో పొలాల్లో వేసిన పంటలు తీక్షణమైన ఎండలకు చినుకు జాడలేక ఎండిపోయి కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడేవారు. రైతులు పంటలు లేక నష్టపోయేవారు. ప్రజలు ధాన్యాన్ని అధిక ధరలు వెచ్చించి ఆకలి తీర్చుకునేవారు. ఇదంతా చూస్తున్న రాజుకు అర్థంకాక తలపట్టుకుని ఏడ్చేవాడు.
  ఇది గమనిస్తున్న మంత్రి మారయ్య పరిష్కారం కోసం సమాలోచనలో పడి ఓ నిర్ణయానికి వచ్చాడు. 
 ‘‘ ప్రభూ  వేసవి కాలంలో వరదలు వస్తున్న ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతంలో నివసించాలి. వర్షాకాలంలో కరువు వచ్చే ప్రాంతంలో నివసిస్తే సరి..’’ అని మంత్రి మారయ్య అన్నాడు.
  ఈ సలహా మాళవికుడికి బాగా నచ్చింది. వెంటనే వేసవి సమీపిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని వదిలి కరువు వచ్చే ప్రాంతానికి ప్రజలు, రాజు తరలి వెళ్లారు. తమతమ వస్తువులు, ధాన్యం తీసుకెళ్లడానికి బాగా ఖర్చుచేశారు. అక్కడికి వెళ్లిన తర్వాత నివాసానికి భవనాలు లేక ధనం వెచ్చించి భవంతులు నిర్మించారు. రాజు వుండడానికి విలాసవంతమైన రాజ భవనం ఏర్పాటు చేశారు.వచ్చిన ఆదాయం మొత్తం అయిపోయింది.  ఎలాగో ఆరు నెలలు గడిపారు. మళ్లీ వర్షాలు వచ్చి వరదలు రావడంతో ఆ ప్రాంతాన్ని వదిలి కరువు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడ వున్న భవనాలన్నీ వరదలకు కొట్టుకుపోయి శిథిలాలుగా దర్శన మిచ్చాయి. 
   రాజు మాళవికుడు తన భవనానికి మరమ్మతులు చేసుకోవడానికి మళ్లీ ధనం వెచ్చించాడు. ఈ సారి అధిక పన్నులు విధించాడు. ప్రజలు పన్నులు కట్టలేక రాజును తిట్టుకున్నారు. ఆరు నెలలు తర్వాత మళ్లీ వరదలు ముంచుకు రావడంతో రాజు తన పరివారంతో కరువు ప్రాంతానికి రాజధానిని మార్చాడు. ఆయనతో పాటు కొందరు ప్రజలు మాత్రమే తరలి వెళ్లారు. మరి కొందరు వున్న చోటే వుంటూ వరదలను ఎదుర్కొన్నారు. ఎత్తైన ఇళ్లు నిర్మించుకున్నారు. పంట పొలాల్లోకి నీళ్లు రాకుండా రాతి కట్టడాలు నిర్మించి పంటలను రక్షించుకున్నారు. తమ పనులు తాము హాయిగా చేసుకుపోయారు. పెద్ద ఆనకట్ట నిర్మించి వరదనీటిని నిల్వచేసి  తమ అవసరాలకు సద్వినియోగం చేసుకున్నారు.
   మళ్లీ కరువు కాలం రానే వచ్చింది. రాజు మాళవికుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. వరదకు కొట్టుకుపోయిన రాజ భవనం నిర్మాణ పనిలో నిమగ్నమయ్యాడు. వున్న ఖజానా డబ్బంతా ఖర్చుచేసి అయోమయంగా కూర్చున్నాడు. రాజును చూస్తున్న మంత్రి మారయ్య ‘‘ ఇప్పుడేం చేద్దాం ప్రభూ..?’’ అన్నాడు.
   మాళవికుడు అర్థం కాని పరిస్థితుల్లో మళ్లీ పన్నులు విధిస్తాం..’’ అన్నాడు.
   ‘‘ అలాగే పన్నులు విధిస్తారు.. వచ్చిన ఆదాయంతో మరో ప్రాంతానికి వెళతారు.. అక్కడ సమస్య వచ్చినప్పుడు మరొక ప్రాంతానికి  మారుతారు.. ఇలా రాజధాన్ని మారుస్తుంటే ఇక పరిపాలన ఎలా చేస్తారు? సమస్యలు ఎక్కడ పరిష్కారమవుతాయి ప్రభూ?’’ అన్నాడు మంత్రి మారన్న.
  రాజు మాళవికుడికి సమస్యలు అర్థం కాలేదు ‘‘ మనం కూడా ఏంచేద్దాం.. సమస్యలు సమసిపోవడానికి రాజధాన్ని మారుస్తున్నాం కదా..?’’ అన్నాడు.
  రాజు తెలివి తక్కువ తనానికి మంత్రి, ప్రజలు నవ్వుకున్నారు. ఈ సారి వరదలు రానేవచ్చాయి. రాజు తన బలగంతో రాజధాన్ని కరువు ప్రాంతానికి  మార్చాడు. 
   ఈ సారి ప్రజలు, మంత్రి మారన్న ఉన్న ప్రాంతం నుంచి కదలలేదు. ప్రణాళికలు రూపొందించి వరదలను సమర్థ వంతంగా ఎదుర్కొని పంటలు పండిరచి విశేష అభివృద్ధి సాధించారు.
   మళ్లీ కరువు కాలంలో ఈ ప్రాంతానికి వచ్చిన రాజు మాళవికుడు రాజధాని నిర్మాణం కోసం పడరాని పాట్లు పడ్డాడు.
   సమస్యలకు పరిష్కారం చూపే ప్రత్యామ్నాయం వెతకని రాజును చూసి తమకు ఏ మాత్రం సహకారం అందించని అసమర్థ రాజు మాళవికుడు పడుతున్న కష్టాలను చూసి మంత్రి మారన్న, ప్రజలు నవ్వుకున్నారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం