చిత్రానికి పద్యం ;- సాహితీసింధు సరళగున్నాల
మేకతల్లిపాలు మేకపిల్ల గుడువ
తల్లి పాలు లేని తనయుడొకడు
ప్రీతితోడ గాంచె ,ప్రేమగా గుండెకున్
హత్తుకొనెడి జనని విత్తజనియె

తల్లిపాలు లేని తనుయుడా గృహమునన్
మేక పాలుతాగ మేనువంచి
గాంచినంత మనసు కన్నీరు కొలనుగా
మారిపాయె జేయ మార్గమేమి

కామెంట్‌లు