ఒత్తిడితో జీవనం;- సి.హెచ్.సాయిప్రతాప్

 పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం..పోటీతత్వంతో పాటే మానసిక ఆందోళనలు, ఒతిళ్లూ పెరుగుతున్నాయి. సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న యాంత్రిక జీవనం మనషులకు మనసిక ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఉరుకులు పరుగుల జీవనం..గజిబిజి బతుకులు అన్ని రంగాలకూ పాకిపోవడంతో మనోవ్యథ అధికమై పోతోంది. ఇంట్లో.. ఆఫీసుల్లో పనిభారంతో మహిళలు.. ర్యాంకుల కోసం పుస్తకాలతో కుస్తీపడుతూ విద్యార్థులు.. ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు..బాస్‌ల టార్చర్‌, నిద్రలేమితో సాఫ్ట్‌వేర్‌, ప్రయివేటు ఉద్యోగులు..పరిణితిలేని ఆలోచనలతో యువత.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
మానసిక ఒత్తిడి రోజువారీ జీవన అవసరాలకు సహజమైన మానసిక మరియు శారీరక ప్రతిస్పందన. ఒక నిర్దిష్ట స్థాయి ఒత్తిడి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది, అదే స్థాయి ఒత్తిడి మరొకరికి చికాకు కలిగిస్తుంది. మనం చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు, "ఫైట్-ఆర్-ఫ్లైట్" అని పిలువబడే మీ శరీరం యొక్క రక్షణ వ్యవస్థ ప్రారంభమవుతుంది. నాడీ వ్యవస్థ అడ్రినలిన్ మరియు కార్టిసాల్ వంటి ఒత్తిడి రసాయనాల వరదను విడుదల చేస్తుంది. అత్యవసర ఒత్తిడికి ఈ ప్రతిస్పందన గుండె వేగంగా కొట్టడానికి, రక్తపోటు పెరగడానికి, కండరాలు కుంచించుకుపోయేలా మరియు శ్వాసక్రియ వేగంగా మారడానికి దారితీస్తుంది. తరచుగా ఒత్తిడి శరీరాన్ని అధిక-ఒత్తిడి స్థితిలో ఉంచుతుంది, ఇది రోగనిరోధక శక్తిని తగ్గించడం, జీర్ణక్రియ మరియు పునరుత్పత్తి సమస్యలు, వేగవంతమైన వృద్ధాప్యం మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒత్తిడి మిమ్మల్ని డిప్రెషన్ మరియు ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు మరింత హాని కలిగించవచ్చు. ఒత్తిళ్ళ కారణంగా జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయి. ఆరోగ్యవంతులైన వారు ఒత్తిళ్ళ కారణంగా అనారోగ్యవంతులై మంచాన పడిన సందర్భాలు అనేకం.
వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎల్ కె జి చదివే  పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది.
సమాజంలో ‘మనీ’ విలువలు పెరుగుతూ మానవసంబంధాలు విచ్చీన్నం అవుతున్న ఈ దశలో కష్టంలో సుఖంలో తోడుగా, నీడగా, మనకంటూ ఓ నలుగురు ఆత్మీయులను సాధించాలి. దాదాపుగా నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు దాదాపు విచ్ఛిన్నమైనప్పటి నుండి ఈ ఒత్తిడి సమస్య అందరికి ఒక సమస్యగా మారింది. మన మనసు లోని మాట మనలోనే ఉండి మనసులో ఒత్తిడి పెంచుతూ అనేకానేక మానసిక రుగ్మతలే కాదు ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పురి గొల్పుతోందీ.
అధిక ఒత్తిడికి గురైన సమయంలో మెడిటేషన్‌కు మించిన మందులేదు. ప్రశాంత వాతావరణంలో కూర్చుని రిలాక్స్‌ కావాలి. కళ్లను చల్లటి తడిబట్టతో తుడుచుకుని కళ్లు మూసి శ్వాసపై ధ్యాసతో ధ్యానంలోకి జారుకోవాలి. ఇలాచేసి ఒత్తిడి నుంచి క్షణాల్లో బయటపడోచ్చు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం