*తొలకరిజల్లు *; - వై నీరజ రెడ్డి ;తెలుగు భాషోపాధ్యాయురాలు.-జడ్పీహెచ్ఎస్ పన్యాల.

 తొలకరి వానల జాడలు లేవాయే .
రైతన్నల ఎదలు బాధతో బరువాయే .
సూర్యుడు భగభగ మండిపాయే .
చిన్న చితక ప్రాణులన్నీకమిలిపాయే.
పశుపక్షుల గొంతులు 
 ఎండిపాయే .
చెట్టు చేమలకు నీళ్లు కరువాయే. 
 చెలమలన్నీ ఎండి పాయే . 
.చుక్క నీరు లేకపాయే.
వానదేవ ఒక్కసారి ఇటుగా వచ్చి .
ఎద పగిలిన ఎండు భూమిని ,పచ్చని పంట భూమిగా మార్చలేవా...?
కామెంట్‌లు