పుస్తకం మరోకోణం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మిత్ర లాభం లాగే మిత్రభేదంలో సాటి రాజులు విరోధులుగా ఉంటే వీరి పరిపాలన ఎంత నికృష్టంగా ఉంటుందో  అనుక్షణం వారి పైన అనుమానాలతో  వారి గురించి ఆలోచించడం వారు ఒకవేళ యుద్ధానికి వస్తే ఎలా ప్రకటించాలి అన్న విషయాలు గురించి  ఎక్కువగా ఆలోచించి  మిత్ర రాజుల సహాయంతో వారిని ఎదుర్కొనే ఏర్పాటు చేసుకోవడానికి  వారిద్దరి సంబంధాలు ఎలా ఉన్నాయో ముందు తెలుసుకొని  దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆ  ప్రక్రియలో గనుక చూసినట్లయితే  తనకు తన రాజ్యానికి తన రాజ్య ప్రజలకు మేలు జరుగుతుంది  కనుక అలా చేయండి అని హితబోధ చేస్తూ ఎప్పుడూ విరోధం పనికిరాదు  ఒకవేళ  కొన్ని సంఘటనల వల్ల అలా జరిగినా దానిని సరి చేయించడానికి  ప్రయత్నం చేయాలి అని చెప్తారు. అలాగే సంధి అన్న ప్రక్రియలో  ఏ రాజుతో ఎలా ప్రవర్తించాలి అన్నది ముఖ్య అంశంగా తీసుకుని నీవా నేనా అన్నట్టుగా ఉన్న తోటి రాజులు ఎవరైనా ఉన్నట్లయితే  వారితో స్నేహాన్ని కలుపుకొని  యుద్ధానికి స్వస్తి చెప్పే పద్ధతిలో మాటలు శాంతియుత వాతావరణాన్ని కల్పించడం కోసం  ఎవరు ఎలా ప్రవర్తించాలో  చెప్పేటప్పుడు  మనం మాట్లాడే భాష  సున్నితంగా ఉండాలి ఎదుటివారిని బాధ పెట్టకూడదు  ఎప్పుడైతే ఇతరులను విమర్శించే పద్ధతిలో మనం మాట్లాడి  వారి మనసులను బాధపెట్టామో  అప్పుడు తప్పకుండా విరోధం పెరుగుతుంది  యుద్ధాలు అనివార్యమవుతాయి  అలా కాకుండా ఉండడం కోసం  సంధి ఎలా ఉపయోగపడుతుందో పిల్లలకు అర్థమయ్యే విధంగా శర్మగారు  తెలియజేయడం ప్రశంసనీయం. విగ్రహము కాకోలీయము అన్న ఐదు విభాగాలను చేర్చి ఆ పుస్తకాన్ని పంచతంత్రము అన్న పేరుతో రచించి విడుదల చేశారు. కథ, జరిగిన కథ అన్న విషయాన్ని ప్రక్కన పెట్టినట్లయితే  మన సాహిత్యంలో  జంతుజాలంతో కథలను నడిపించగలిగిన సామర్థ్యం ఉన్న రచన  ఇది మొదటిది అని చెప్పవచ్చు  దానిని తెలుగులో పరవస్తు చిన్నయ్య సూరి గారు అనువదించి  అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. అయితే విష్ణుశర్మ గారి భాష కన్న ఈయన భాష కొంచెం జటిలం తర్వాత కొంతమంది అనువదించారు. కానీ  వారి రచనలు ఆంధ్రులకు అంగీకరించేలా  లేవు అందుకనే ఎవరు చదివిన  దృష్టాంతాలు కనిపించవు  అనేక పాఠశాలలో ఈ గ్రంథాన్ని  పాఠ్యాంశంగా చేర్చారు కూడా.


కామెంట్‌లు