పుస్తకం మరోకోణం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మేధావి వర్గం ఒక శ్లోకం రాశారు  పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః  అధవా పునరాయాతి  జీర్ణం భ్రష్టా ఖండశః పుస్తకం కానీ స్త్రీ కానీ డబ్బు కానీ ఇతరుల చేతికి వెళితే  పుస్తకం చిరిగి వస్తుంది  స్త్రీ పాడై వస్తుంది  ధనం అంచెలంచెలుగా వస్తుంది  అసలు మీద అతనికి శ్రద్ధ ఉండదు  అది తన సొంతం కాదు ఇతను వాడిని కనుక ఇష్టం వచ్చినట్లు వాడి దానిని నాశనం చేసి మరీ పంపుతాడు  డబ్బులు పెట్టి కొన్న వ్యక్తి దానిని చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాడు  ఇది చాలా బాగుంది ఒకసారి చదివి ఇస్తాను అని తీసుకెళ్లినవాడు  కనీసం రెండు మూడు పేజీలు అయినా చించకుండా  అది పాడవకుండా ఇతని చేతికి ఆ పుస్తకం తిరిగి రాదు  అలాగే డబ్బు తీసుకున్న వాడు  దానిని కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు మరి కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు.
సద్వినియోగం చేసుకున్న వాడు  తనకు వచ్చిన లాభాలలో అప్పుడు కాస్త అప్పుడు కాస్త  అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు  ఒకేసారి ఇస్తే తన వ్యాపారానికి  మూల ధనం సరిపోదని అతని అభిప్రాయం  అప్పు దొరికింది కదా అని దానిని విచ్చలవిడిగా  వాడిన వాడు ఎందుకూ పనికిరాకుండా పోతాడు  వాడు దానిని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇవ్వలేని స్థితిలో ఉంటాడు  ఏ మొహం పెట్టుకొని వారు ఇద్దరూ ఒకటినొకరు చూసుకుంటాడు  పోతే పోయింది మరొకసారి అడగకుండా ఉంటే చాలు అనుకుంటాడు. తిరిగి ఇస్తే మళ్లీ అడుగుతాడు అది ఒక బాధ  కనుక అతని దగ్గరకు వెళ్లడం మానుకుంటే చాలా  ఉత్తమం అని ఇతను అనుకుంటే  డబ్బిచ్చి రోజు వాడే వస్తువులు కొనుక్కోవడం అంటే ఇలాగే ఉంటుంది.
వనితను వాడడం అనేది  ఆ రోజుల్లో  ఒక పద్ధతిలో ఉండేది  కొంతమంది వ్యాపారం కోసం  తన గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లి  నెలల తరబడి  తన వ్యాపారం పూర్తయ్యేంతవరకు కూడా ఇంటికి రాడు  కనుక అతను వెళ్లేటప్పుడే  తన స్త్రీని తనకు అత్యంత సన్నిహితుడు  ఆత్మీయుడు  మంచివాడు అనుకున్న స్నేహితుని వద్ద కుదువ పెట్టి వెళ్తాడు. అతను  వ్యాపారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది  మనసులు మనసులు కలవవచ్చు  ప్రేమలో పడడానికి అవకాశం ఉంటుంది  వివాహం చేసుకోవడానికి కూడా ఇద్దరూ  అంగీకరించవచ్చు ఈ లోపు  స్నేహితుడు వచ్చేలోపు వీరి అక్రమ సంబంధం బలపడి  ఆమె మరింత చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆ రోజుల్లో ఉన్న వ్యవస్థ.


కామెంట్‌లు