96.ఆ.వె.
బాపు బాట లందు బాగుగా నడుచుచు
సమత జూప వలెను సరళముగను
ధర్మ శాంతి సత్య దయతోడ ధన్యమై
సౌమ్య గుణము విడక సాగవలయు!!
97.ఆ.వె.
దేశ సేవ జేసి దేశ పౌరుల దిద్ది
ధనము కనకములను దాచ కుండ
ధర్మ మార్గ మందు ధరణిలో నిలువుము
సౌమ్య గుణము విడక సాగవలయు!!
98.ఆ.వె.
జగము నేలి నడుప జగపతిగా నుండి
పూరిలోన వెలిసె పూజ్య భావ
ముగను వేడుకొందము మనసార కొలిచి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
99.ఆ.వె.
అందమైన రాజహంస నీతి గనుము
చల్ల గాలి నిచ్చు చెట్టు ఛాయ
ధర్మ మాచరించి ధర్మజీవి యగుము
సౌమ్య గుణము విడక సాగవలయు!!
100.ఆ.వె.
మాట మార్చకుండ మాట నిలుపుమోయి
సూటి పోటి మాట సూది వోలె
మంచిమాట వలన మనకు మేలు కలుగు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి