101.ఆ.వె.
రోగమొచ్చెననియు రోదించబోకుము
రోగమేదొ చూసి రోజు రోజు
మందులేసుకొనుము మానుమార్గమునకు
సౌమ్య గుణము విడక సాగవలయు !!
102.ఆ.వె.
తోటి మనిషి బాధ తోబుట్టువైనను
ఇరుగు పొరుగు వారు చెలిమితోడ
ఆదుకొనిన నాడె కష్టము గడదేరు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
103.ఆ.వె.
కాదు కాదు యనుచు కయ్యంబులాడకు
లేదు లేదు యనుట లేకి తనము
నాది నాది యనుట నరకమునకుదారి
సౌమ్య గుణము విడక సాగవలయు!!
104.ఆ.వె.
కష్టము దరి జేర కలతజెందవలదు
కష్టసమయమందు కలిసి యుండి
మనిషినిలకడున్న మనసునిర్మలమగు
సౌమ్య గుణము విడక సాగవలయు!!
105.ఆ.వె.
పరుల పరిచయములు పరిశీలనలతోడ
నరులు నెరిగి చూసి నడువవలెను
గాలి వాట నావ గట్టిగ నుండునా?
సౌమ్య గుణము విడక సాగవలయు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి