పంచపది ,;- మానవ లక్షణాల ఎరుక!;- డా. పివిఎల్. సుబ్బారావు ,9441058797.
నా పంచ పదుల సంఖ్య---

973.
కార్య అకార్య సమారంభే, తస్మాత్ శాస్త్రం ప్రమాణము!

"పిల్లల లక్షణాల కారణం,  
       తల్లితండ్రుల రక్తము"!

నాటి అభిప్రాయము, నేడు,
      అనువంశికత నిజము! 

తెలియచెప్పిన జీవశాస్త్ర,
    విభాగం జన్యు శాస్త్రము!
 
క్రోమోజోముల జన్యువులు, అనువంశికత మూలము, పివిఎల్!

974.
డార్విన్ జీవ పరిణామ,   
  సిద్ధాంత ఘన ప్రాబల్యము!
 
మెండల్ పద్దెనిమిది ఏళ్ల,
        కృషి మరి నిద్రాణము !

మెండల్ మరణానంతరము 
        పదహారేళ్ల కాలము!

హాలండ్ డివ్రీస్ ,జర్మనీ కారెన్స్ ,
       అద్భుత  యత్నము ! 

మెండలిజం  ఆవిర్భావము,
విశ్వాన శాస్త్ర సమ్మతము,   
                        పివిఎల్!
_________


కామెంట్‌లు