భారతీయుడైన ప్రతివాడు సంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటాడు నీతి నియమాలకు కట్టుబడి ఉంటాడు ఇతరులకు సహాయం చేయడంలో ముందు ఉంటాడు భారతంలో విదురనీతిలో విదురుడు చెప్పిన ఒక విషయం నీవు నిజాయితీగా సంపాదించిన ధనంలో 8.3% దానధర్మాలకు వినియోగించు అని చాలామంది దానిని తప్పకుండా ఆచరిస్తున్న వారు ఉన్నారు అయితే ఆ దానం గ్రహించే వ్యక్తి ఎలా ఉండాలి ఎవరికి దానం చేస్తే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచించే వారి సంఖ్య పెరిగిపోతుంది ఆకలయినవాడికి అన్నం పెడితే హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు మంచి జరగాలని దేవుని కోరుకుంటాడు అతని ఆకలి బాధను తీర్చిన మిమ్మల్ని భగవంతుని గానే చూస్తాడు.
అదే సుష్టుగా భోజనం చేసి వచ్చిన వాడికి షడ్రసోపేతమైన భోజనం పంచభక్ష్య పరమాన్నాలు వండి వడ్డించి సుఖంగా తినమని చెబితే అతను ఏదో తిన్నట్టుగా నటించి దానిలో వంకలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప కృతజ్ఞతా భావం అతనికి ఏ కోశానా ఉండదు ఇది జగమెరిగిన సత్యం అర్హుడైన వాడిని ఎన్నిక చేసి వారికి సహకరించి దానం చేస్తే దాని ఫలితం దక్కుతుంది తప్ప ధనవంతునికి నీవు దానం చేస్తే అది ఏమవుతుంది అంటాడు వేమన దరిద్రం తాండవిస్తున్న కుటుంబంలో భోజనానికి కూడా ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారిని ఎన్నుకొని వారికి కావాల్సిన సంబరాలను అందించి వారి ఆకలి తీర్చగలిగిన దానం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
అతడు ఎలాంటి వాడు అన్నది కాదు ప్రశ్న అతని ప్రవర్తనను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నిజమైన అవసరంలో ఉన్నాడా లేదా అతడు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే అతను తప్పక దానానికి అర్హుడు వేదాలు అంటే ఏమిటో తెలియకపోవచ్చు వేదం చెప్పిన కర్మలను చేయడం అతనికి చెప్పిన గురువులు లేకపోవచ్చు కర్మలు చేయడానికి దూరంగా ఉన్న వ్యక్తి అయినా అతని స్థితి గమనించి దానిని అర్హతగా స్వీకరించమంటున్నాడు వేమన దానివల్ల అతనికి మంచి జరగడమే కాకుండా మీరు చేసిన దానానికి విలువ ఉంటుంది మీ మనసుకు తృప్తి కలుగుతుంది. ఇలాంటి అనేక నీతులను మన ముందు మనకు అర్థమయ్యే పద్ధతిలో పద్యాలను రాసిన వేమనను అభినందించి తీరవలసినదే వారు రాసిన పద్యాన్ని చదవండి.
"దోసకారియైన దూసరి కాడైన పగతుడైన వేదబాహ్యుడైన వట్టి లేని పేదవానికీడగు నీవి ధనికునకు నొసంగ దగదు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి