"శాంతి దూత"- కొప్పరపు తాయారు
అందాల పావురమా
శాంతి సందేశాల రూపమా
అందజేసేవు ఆనాడు
సందేశాలు అవలీలగా!!

తరువాత తరం లో
రాజుల ప్రేమ ‌‌సందేశాలు
రాజ్యపాలన, రహస్యాలు
 నెరవేర్చావు నేర్పుగా!


ఎన్నెన్నో కార్యాలు చేసావు
అందానికి ప్రతిరూపం
ఆనందానికి నిలయం
సున్నిత స్వభావం

యజమాని మనోభావన
విశ్లేషణ కర్త గొప్ప పక్షిరాజమా
మనిషితో మన్ననలు పొందు
మంచి స్నేహిశీలి , శాంతి దూతవు!

నీవు రాజ్యాలు, రాజులు
ప్రేమికులు, సర్వులు, నీకు
దాసాను దాసులు, పాల
వంటి ఛాయ తోడ, కువ కువ,

కులుకులతోడ చెప్పు
సందేశాలు, సంతోష మే
సగం బలం, అని దేశ ప్రగతికి
నాటి నుంచి నేటి వరకు !

దారి తప్పక, నిలచిన తెల్లని
నన్ను మెచ్చని వారు ఎవరు
అని ప్రశ్నించ తాహతు ఉంది
సుమీ,అందుకే చా చా నెహ్రూ
ఎగురవేసె శాంతి దూత గా!!

కామెంట్‌లు