అతడే నీ సైన్యం అనుకున్నావు కానీ..., తండ్రీ , సోదరుడూ , భర్తా నీ నమ్మకాన్ని వమ్ము చేశారు. మామా, బావా , ఆఖరుకు తాతా అని నీవు పిలిచిన ప్రతివాడూ నిన్ను నట్టేట ముంచారు. ఇంటిపక్కవాడూ, దారినపోయే దానయ్యా నిన్ను వంచించేవారే. బడీ, గుడీ, బజారూ, పార్కూ, దుకాణమూ, బస్టాండూ, రైల్వేస్టేషనూ అన్ని ప్రదేశాలూ నిన్ను నిలువునా నగ్నంగా చూసేవే. నిన్ను రక్షించేవాడెవడు? నీకోసం పరితపించేవాడెవడు? కనుక అమ్మా! నీకు నీవే సైన్యంగా మారు. ఈ దుష్ట మృగాళ్ళ సామ్రాజ్య తలను ఉత్తరించు. నీవు అబలవు అనుకున్నవాళ్ళ పీచమడచి సబలవనిపించుకో! నీ అసలైన శక్తి స్వరూపాన్ని ప్రదర్శించు!!!
+++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి