" ఏనుగు తాతా ఆనందం అంటే ఏమిటి " అన్నాడు కోతిబావ . " మనవాడా ఆనందం సందర్బోచితంగా కలిగేది.
మనం తినే ప్రతి పండుకు ఒక రుచి, ఆస్వాదన ,అనుభూతి ఉంటుంది. ఉదాహరణకు సపోటా,జామ, మామిడి,సీతాఫలం వంటి పండ్లకు దేనిరుచి దానిదే అయినప్పటికి మనం పండు తినే సమయంలో ఎలాఉంది అని ఎదటివారు అడిగితే తియ్యగా ఉంది అంటాము. తియ్యదనం తెలియాలి అంటే చిటికెడు చక్కర లేక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు నోరంతా తియ్యగా మారిపోతుంది. దానికి ఇంత వెల చెల్లించి పండు కొనుగోలు చేయనవసరం లేదు.ఇక్కడ ప్రతి పండుకు ఒక రుచి ఉంది ఆరుచిని మనం వెల్లడించలేక బాగుంది, తియ్యగా ఉంది అంటాము "అన్నాడు ఏనుగు .
" తాతా దానం వలన ప్రయోజనం ఏమిటి ? "అన్నాడు కుందేలు మామ.
" ప్రతి చర్యలోనూ మనకు తెలియకుండానే ఆనంద, అనుభూతికి లోనౌతాము .
ఉదాహరణకు నీకు రెండు జామపండ్లు అభించాయనుకో వాటిలోఒకటి నీవు తింటూ ఉండగా,అదే సమయానికి కోతి బావ నీవద్దకు వస్తే అప్పుడు నీవద్దఉన్న రెండో జామపండు కోతిబావకు ఇస్తావు. ఆకలితో ఉన్న కోతి బావ ఆపండును తింటూ ఉంటే, అదిచూసిన నీకు కలిగే అనుభూతి, ఆనందం కలుగుతుంది. అసలు దానం అనేది ఒక గొప్ప చర్య. అలాచేయడంవలన మానవ చరిత్రలో ఎందరో శాశ్విత స్ధానంపొందారు.
కవచ కుండలాలు దానం చేసిన కర్ణుడు, శ్రీమహవిష్ణువుకే దానమిచ్చిన బలిచకక్రవర్తి, తన శరీరంలో మాంసాన్ని కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి వంటి వారు ఎందరో నడయాడిన నేలఇది .మనం తినడమే కాదు, ఎదటి ప్రాణులుకూడా ఆకలి,దాహంతో ఉంటాయని వాటి ఆకలి కూడా మనం గమనించి తింటున్న ఆహరంలో కొంత సాటిప్రాణులకు దానం చేయడం మనవిధి,ఈ అలవాటు మనం మనపిల్లలకు నేర్పిస్తే మంచిది. వేలాది ప్రాణాలు ఆహరం అందుబాటులు లేక మరణిస్తున్నాయి అంటే,వారితో కలసి జీవించేమనం వాటిని ఆదుకోవాలి. అంటే సాటి ప్రాణి ఏదైనా,మనిషి, కుక్క,పిల్లి ,పక్షులు వంటి ప్రాణులను మనం ఉన్నంతలో ఆదుకోవాలి "అన్నాడు ఏనుగు. "నిజమే వందేళ్ళు బ్రతకమని తెలిసి మనిషి ,వెయ్యేళ్ళకు సరిపడా సంపాదించుకుంటాడు. మూడు పూటలా తినేవారు,ఎదటివారు ఒకపూటైనా కడుపునింపునేందు మార్గం చూపించాలి " అన్నాడు కుందేలు మామ. " ఆకలి విలువ, దానం గొప్పతనోం తెలుసుకున్నాను.దానం చేయడం నేటినుండి నేను ఆరంభిస్తున్నాను.ఇవిగో నావద్ద మూడు బంగనపల్లి మామిడి పళ్ళు ఉన్నాయి తలాఒకటి తిందాం "అన్నాడు కోతిబావ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి