జానపద కళారూపాలు. బుర్ర కథలు.;- తాటి కోలప ద్మా వ తి

 ఈ కథలకు తందాన కథలనీ తందానా పాటలని కూడా ప్రచారం ఉంది. ప్రాచీన కాలం నుండి ఉన్నవి అనడానికి ఉదాహరణగా క్రీడాభిరామంలో ఆంధ్ర ప్రజా జీవితంతో ఇంత విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఈ బుర్రకథను గూర్చి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో గాని, పండితారాధ్య చరిత్రలో గాని, తొలి వీధి నాటకం క్రీడాభిరామంలో కానీ ఎవ్వరూ దీనిని పేరు పెట్టి స్పష్టంగా పేర్కొనక పోవడం చూడగా ద్విపద భూయిష్టమైన ఈ రచనకు ప్రక్కవాద్యాల ప్రాబల్యాన్ని బట్టి క్రమేపీ ఈ పేరు రూఢమై ఉండవచ్చు.
జానపద వాంగ్మయంలో జంగం కథల సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని వహిస్తూ ఉంది. ఈ సాహిత్యంలో చాలా రకాలు కనిపిస్తున్నాయి. చాలావరకు పూర్వ యక్షగానాల్లో ఇతివృత్తమంతా పురాణ గాధలకు సంబంధించినది. యక్షగానాలు బుర్రకథలుగా అభివృద్ధి చెందిన తరువాత, బొబ్బిలి యుద్ధం , పల్నాటి వీర చరిత్ర మొదలైన చారిత్రక యుద్ధ గాధలు, బాలనాగమ్మ, కామమ్మ, చిన్నమ్మ, లక్ష్మమ్మ, తిరుపతమ్మ జానకి వాసం మొదలైన కరుణ రస ప్రధానమైన పాతివ్రత్య గాథలూ ఉత్తర గోగ్రహణం, వామన విజయం, దేవయాని చరిత్ర, అంబరీషోపాఖ్యానం మొదలైన భారత రామాయణ గాధలకు సంబంధించిన అనేక కథలు వచ్చాయి.
దేవీ నవరాత్రులలో ఈ బుర్రకథలను ముగ్గురు వ్యక్తులు వంతలు పాడుకుంటూ చిడతలు వాయిస్తూ డోలు మోగిస్తూ రకరకాల హావ భావాలతో బుర్రకథలు చెబుతూ ఉంటారు.

కామెంట్‌లు