శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

హిందీ లో ప్రస్తావ్ అంటే కొత్త విషయాలు ఇతరుల ముందు ఉంచడం అని అర్థం.కానీ సంస్కృతం లో ప్రస్తావ్ అంటే ప్రారంభికస్తుతి.సామవేదంలో ఒక అంశం ప్రస్తోతా అనే ఋత్విక్కుద్వారా గానం చేయబడినవి.బ్రాహ్మణగ్రంథాలు ఛాంద్యోగపనిషద్ లో ప్రస్తావ్ నా ఇదే అర్థం లో వాడారు.నాటక ప్రారంభంలో ప్రస్తావన ఉంటుంది.వార్తాలాపవిషయం అని ఇంకో అర్థం.సభలో ఓవిషయంపై చర్చించడం అన్నమాట.బెంగాలీ నేపాలీ లోభావం అని తెలుగు లో ప్రస్తావన గా కథనం వర్ణన అనే అర్థం లో వాడితే తమిళంలో పిరస్తావం  పంజాబీలో నిబంధన వ్యాసం అని అర్థం.
ప్రతిశాఖ్య అనే గ్రంథంలో వేదాల్లో ఏదో ఒక శాఖ స్వరం పదం సంహిత సంయుక్త వర్ణాల ఉచ్చారణ ఉంది.శిక్ష వ్యాకరణం ఉంటాయి.
ప్రారబ్ధ అంటే పూర్వజన్మ పూర్వకాలంలో చేసిన మంచి చెడుల కర్మఫలాలు.వాటిని వర్తమానం లో అనుభవింపక తప్పదు.సంచిత క్రియమాన ప్రారబ్ధాలు అని రెండు రకాలు.సంచితం పూర్వజన్మ క్రియమాన అంటే ఈ జన్మలో చేసిన పనులఫలితాలు.అనిచ్ఛా పరేచ్ఛాస్వేచ్ఛ ప్రారబ్ధాలు మూడు ఉన్నాయి.
కామెంట్‌లు