కొత్తదనం;- బి అనసూయ

 చిన్నప్పుడు ముసలీ అని 
ఎవరు ముచ్చట చెప్పినా కలుక్కుమంటుoడే
వెక్కిరించకుంటే నేను ముదిమి నుండి 
తప్పించుకుంటనేమో అన్న ఆశ
కానీ అట్ల జరగలే
నా మోకాళ్ళు నన్ను నడవనీయక
నా తల తెల్లటి సబ్బు నురగలా
ఒకటికి రెండుసార్లు చెప్తున్నా
నా చెవులకి ఏమీ వినిపించక
కంటిపొరల చికిత్సలతో
దూరాన ఉన్నవి కంటికానక
అరే!నేనేంది?ఈ పరీక్షలేoది?
ఎవర్నీ మాట అననీయక
పెద్దవాళ్ళ మనసులో మాటనీ
చెప్పకున్నా సేవ చేసిన నాకూ
ముదిమి ముసిరి మనసంతా కలత
సినారె కవిత యాదికొచ్చింది
"తలుపులు కిటికీలు ఎంతగ మూసుకొని ఉన్న
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా"
భ్రమ నన్ను మరిపిస్తే ప్రకృతి సముదాయించింది.
కామెంట్‌లు