ఆషాడం వెళ్లి.. శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలకు ప్రతిరోజూ పండగే. ప్రతి ఇల్లు ఓ మందిరాన్ని తలపిస్తుంది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురణాలు చెప్తున్నాయి. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువమంది ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. వర్షర్తువులో సంభవించే ఈ మాసంలో ప్రకృతి ఎంతో చల్లగా ఉండడం, చక్కని వర్షాలు కురవడం, పైరులన్నీ పచ్చదనాలతో కళకళలాడడం కనబడుతుంది. అందుకే ప్రకృతిలోనూ, జీవజాలంలోనూ ప్రశాంతత వెల్లివిరుస్తుంది. వర్షాలతో నిండు కుండలవలె రూపొందే జలాశయాలు పూర్ణకుంభాలవలె నేత్రానందాన్ని కలిగిస్తాయి. జలసంపద సమృద్ధిగా ఉండడంవల్ల పాడిపంటలకు అనువైన వాతావరణం తో పాటు రైతుల ముఖాలలో ఆనందం తాండవిస్తుంది. ప్రతి పల్లె, ప్రతి పట్టణం అనే తేడా లేకుండా అంతటా ఆనందసందోహాలు తాండవమాడుతాయి. జనులందరూ ఉల్లాసంతో తమతమ విధులను నెరవేరుస్తూ ఆనందిస్తారు.శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే, కల కళలాడే ఒక దివ్య ఆలయమే అని చెప్పక తప్పదు. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు ...మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి మరియు జంధ్యాల పౌర్ణమి జరుపుకుంటారు.శ్రావణ మంగళవారాలో గౌరిదేవి వ్రతమాచరిస్తారు. శ్రావణమాసం సోమవారాలలో శివుణ్ణి ఆరాధిస్తారు.శ్రావణపౌర్ణమి రోజే రక్షాబంధనం లేక రాఖీపౌర్ణమి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం యెక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. సోదరీమణులు సోదరులకు రాఖీకట్టి రక్షకోరతారు.
సాధారణంగా గుడిలో కానీ ఇంట్లో కానీ దీపం పెట్టడం అంటేనే ఎంతో గొప్ప పుణ్యాన్ని కలిగించే విషయం.
శ్రావణ శుక్రవారం ప్రత్యేకత కదా అని మిగిలిన రోజులు పట్టించికోకుండా ఉండటం సరికాదు. ప్రతిరోజు ఉదయమే ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి పూజ, దీపారాధన జరిగితే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలను ఆ మహాలక్ష్మి దేవి అనుగ్రహిస్తుందని పెద్దలు, పండితులు చెబుతారు. కాబట్టి శ్రావణమాసాన్ని భక్తిగా అందరం పాటించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి