న్యాయాలు -198
మూర్ఖ సేవన న్యాయము
******
మూర్ఖః అంటే మందమతి,అవివేకి,కౄర మనస్కుడు అని అర్థము.సేవన అంటే కొలువు,కుట్టు, అనుభవించుట, సేవించుట అనే అర్థాలు ఉన్నాయి .
మూర్ఖ సేవన అంటే మూర్ఖుని కొలిచినట్లు.
మూర్ఖుని కొలిచిన ప్రయోజనము లేకపోవుటయేగాక వాని మూర్ఖత్వం మనకూ సంక్రమించే పరిస్థితులు ఉంటాయి.
అసలు మూర్ఖుడు అంటే ఎవరు? అతని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం...
అవివేకం, అహంకారం,ఎదుటి వారిలో తప్పులు వెదుకుట,అకారణ క్రోధము,మాట మీద నిలబడక పోవడాన్ని తేలికగా తీసుకోవడం,ద్వేషము,కలహాలమారితనం,నిర్దయ,ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుట... ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మూర్ఖులలో కనబడుతూ ఉంటాయి.
అలాంటి లక్షణాలను బట్టి మూర్ఖులను ముఖ్యంగా మూడు రకాల వాళ్ళుగా చెప్పవచ్చు.తమ స్వార్థం కోసం ఇతరులకు హానీ చేసేవాళ్ళు మొదటి రకమైతే;
తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా,లాభం లేకపోయినా ఇతరులకు కీడు సంభవిస్తుంటే చూసి ఆనందించే వాళ్ళు రెండో రకం.
ఇక మూడో రకం ఇతరులకు హానీ చేయడమే తమ పరమావధిగా భావించేవారు.ఈ క్రమంలో తమకు నష్టం కలిగినా పట్టించుకోరు,ఇతరుల విధ్వంసమే వారికి కావాలి.అంత కౄరులన్నమాట.
మూర్ఖులు లేదా అవివేకులైన వారిని కౄరమైన మనసున్న వారిగా భావించిన భాస్కర శతక కర్త అలాంటి వారిని సేవిస్తే ఏం జరుగుతుందో అర్థమయ్యేలా రాసిన ఈ పద్యాన్ని చూద్దామా!.
"కౄరమనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచివారికిన్/వారి గుణంబెపట్టి చెడువర్తన వాటిలు; మాధురీ జలో/దారలు గౌతమీ ముఖ మహానదు లంబుధి గూడినంతనే/క్షారము చెందవే మొదలి కట్టడలిన్నయు దప్పి భాస్కరా!"
కౄరాత్ములు అనగా మూర్ఖులను సేవించు వ్యక్తికి అలాంటి మూర్ఖుల గుణములే అలవడతాయి.అది ఎలా అంటే తీయని జలములను ఇచ్చే నదులు సముద్రంలో కలిసి ఉప్పగా మారి పోతాయి కదా!.
మూర్ఖుడు రాజైతే ఎలా వుంటుందో మన చిన్నప్పుడు హిందీలో "మూర్ఖ్ మహారాజా" అనే పాఠానికి సంబంధించిన కథ మన తరం వారందరికీ గుర్తే వుండి వుంటుంది.
ఇతర దేశం వాళ్ళ మోసంలో చిక్కుకుని "దేవతా వస్త్రాలు" అనే పేరుతో అసలు బట్టలే లేకుండా ఊరేగడం, అవి కేవలం అమ్మ మంచిదైన వాళ్ళకే కనిపిస్తాయని అనడంతో ప్రజలంతా నోరుమూసుకుని వుండటం, ఇవేమీ తెలియని ఓ పసి పిల్లవాడు అది చూసి షేమ్ షేమ్ రాజు బట్టలు లేవని అనడంతో తన తప్పు తెలుసుకోవడం" ఈ కథ ద్వారా మూర్ఖులను కొలిస్తే ఎలాంటి అనుభవాలు, అనర్థాలు కలుగుతాయో తెలుస్తుంది.
కాబట్టి మూర్ఖుల జోలికి పోకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని ఈ"మూర్ఖ సేవన న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి