జీవనశైలి వ్యాధులు ; - సి.హెచ్.ప్రతాప్

 ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్  మద్దతుతో దశాబ్దకాలం పాటు సాగిన అధ్యయనం ప్రకారం దేశంలో పదవ వంతు మందికి మధుమేహం, 35 శాతం మందికి రక్తపోటు మరియు 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారు. ఈ పరిస్థితుల ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వుండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు శరవేగంతో విస్తరిస్తోంది. ...
అంటు వ్యాధులైన మలేరియా, కలరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ, అదే సమయంలో లైఫ్ స్టయిల్ డీసీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు ఇప్పుడు విపరీతంగా  పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగానూ పేర్కొనవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టయిల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది (30 - 69 ఏళ్ల మధ్య) ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు.
ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, తీపి పదార్థాలు ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారకాలే. ఉఇటువంటి అనారోగ్య ఆహారపు అలవాట్లు ఇప్పుడు వివిధ జీవనశైలి వ్యాధులకు కారణమవుతున్నాయి.ఇక శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి ఒకే చోట కూర్చోని పని చెయ్యదం, టి వి, మొబైల్స్, కంప్యూటర్లకు వుపరీతంగా అలవాటు పడిపోవడం ఇత్యాది కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్తమా, అల్జీమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి.  
కామెంట్‌లు