" కృషీవల * ఋషి *... !"; - కోరాడ నరసింహా రావు
అతడు సూర్యుడ్ని నిద్రలేపి పరుగులు తీయిస్తాడు... !
 పక్షుల్ని పలుకరించి... 
   రాగాలు పలికిస్తాడు... !!

అతడికి పొలమే ప్రపంచం... 
 వ్యవసాయమే సర్వస్వం... !
 నాగలి... కొడవలి లాంటివన్నీ 
 అతడి ఆయుధాలే... !

ఆవు, ఎద్దు, లాంటి సహచర శ్రామిక మిత్రులతో కలిసి... 
 బీడును బంజరుగా మార్చి... 
 కంటికి రెప్పలా కాపాడుతాడు!

సేంద్రీయతను సేకరించి... 
 హోమగుండమైన మడిలో... 
 శక్తిని జ్వలింపజేస్తాడు... !
 ఋషియై యజ్ఞం చేస్తాడు !!

తృణధాన్యాలు, ఆకు కూరలు 
పండ్లు...కాయగూరలు, ఎన్నో 
 ఎన్నెన్నో రకాల హావిర్భావ పదార్ధాలకు పురుడుపోసి....,  

శక్తి, చైతన్యము, ఆరోగ్యము... 
 జ్ఞానముల ప్రతిరూపాలను 
 అందరికీ ఆనందంగా అందించే 
    యోగి ఈ త్యాగధనుడు !!

సేద్యం చేసి - చేసి... 
 సారాన్నంతా పిండి - పిండి... 
నేల నిస్సారమైపోయి..., 
 పశువులు అంతరించి... 
 సేంద్రియ శక్తి మాయమై... 
 అపరిమితంగా పెరిగిన జనావ సరాలకోసం..., 
    యంత్రాలు - రసాయనాల నాశ్రయించి... 
   పాపం... ఈ యజ్ఞ కర్త.... 
 వ్యవసాయ యాగం కొన సాగి స్తూనే ఉన్నాడు... !!

ఎన్నెన్ని అవాంతరాలడ్డు వచ్చినా... 
  ఎన్నెన్ని ఎదురుదెబ్బలతో పడిపోతున్నాయి... 
  సర్వశక్తులూ... హరించుకు పోతున్నా... 
  కొన ప్రాణంతో కూడా.... 
 మన ప్రాణాలను నిలబెట్టేందుకు... 
  వ్యవసాయ యాగం కొన సాగి స్తూనే ఉన్నాడు !!

జీవశక్తితో... మనకు ప్రాణాన్ని, రూపాన్ని ఇచ్చింది ఈ నేల తల్లియైతే...., 
    మనల్ని పెంచి, పోషించి... 
 సంరక్షించే తండ్రి... ఈ రైతన్నే !
       **&&&&

కామెంట్‌లు