నా దృష్టిలో..... ! "; - కోరాడ నరసింహా రావు
మీరు  సెక్సెస్లు సాధించినోళ్లు!
  నేను ఫైల్యూర్స్ ని చవి చూచిన వాడిని !!

   మీ రాతలకు - మాటలకు 
     ఉన్నవిలువ.... 
       నా కెక్కడిది .. !?

ఆ సత్తా....., 
   సహజంగా... 
    మీకు పట్టుబడి ఉండవచ్చు! 

మీకు  వెన్నుదన్నుగా... 
 .. వెనుక - ముందు... 
       ఎవరెవరో  ఉండవచ్చు !

మీ విజయాలకు... 
   ఎన్నో  కారణా లున్నట్టే..., 
    నా పరాజయాలకూ .... 
     ఎన్నెన్నో  కారణాలు !!

నాది అహంకారమా.....!
  కానే కాదు.... 
 .  ఖచ్చితమైన ఆత్మ విశ్వాసం! 

వందిమాగదిని  కాలేదనో... 
  వాళ్ళ చానళ్లను... 
   సబ్స్క్రిబ్ చెయ్యలేదనో... 
      ఏవైనా  కావచ్చు.... !

నాది  ఓటమి...., 
   అని నే నెపుడూ అనుకోను 
      ఎందుకంటే....., 

మీ అందరి కంటే  ముందే.... 
    నేను రాసిన ప్రతి దానినీ... 
      నా అంతరాత్మ పరిశీలించి 
         ఆనందించి.... 
          ఆమోదించి..... 
.    శహభాష్ అని.... 
     మెచ్చుకున్న  తరువాతే... 
      మీరంతా.... 
   నారచనలకు పాఠకులు !

 మీరంతా ఇచ్చే... ప్రశంసలు 
   ఆ యా   బహుమతుల కన్నా
     నాదృష్టిలో.... 
  దాన్ని మించిన సర్టిఫికెట్ లేదు 
       అదే... గొప్ప బహుమతి !!
      *******

కామెంట్‌లు