:-నేడు నీది కాలేదని.... !..- :-కోరాడ నరసింహా రావు.. !

 పల్లవి :-
       నేడు నీది కాలేదని, నిరాశ చెందకు మిత్రమా... !
   రేపు నీదే ఔతుందను నమ్మకంతో నీవు బ్రతుకుమా !!
       "నేడు నీది కాలేదని... "
చరణం :-
      ఆశ - నిరాశల, ఊగిసలాడే కాటా యేరా జీవితం..., 
  ముళ్ళు ఎటు తూగినా నిలకడగా నువ్ నిలవటమేరా గోప్పతనం... !....
         "ఆశ -నిరాశల.... "
     " నేడు నీది కాలేదని.... "
చరణం :-
ఎదురు దెబ్బల అనుభవాలే పాఠా లని తెలుసుకో..., 
  చక్కగా సరిదిద్దుకుని... 
  బ్రతకటం నువ్ నేర్చుకో... !
   ఓటమిని చవిచూసావని... 
   వెన్ను చూపకు మిత్రమా.. !
  పట్టుదలతో ప్రయత్నించు గెలిచి...నిలిచెదవునమ్ముమా!!
       "నేడు నీది కాలేదని.... "
    *********
కామెంట్‌లు