"ఒక రోగం";- కొప్పరపు తాయారు
మతి ఉంటేనే మరపు 
మతి లేక పోతే గతి తప్పు
జాతి, గౌరవ జాతి తప్పించు కొను
జూచు తప్పుడు పనులతో.. .

కొందరు మందమతుల
సౌభాగ్యం మరుపు
మరుపు మహా గొప్ప
ఔషధం,తనను తాను
రక్షించుకొను కడు రమ్యం

ఎచటి కేగినా బ్రతుకవచ్చు
కానీ, ఇల్లు మరచిన కడగండ్ల పాలే
నిజం చెప్ప ఇది ఒక మహమ్మారి
రోగం,అసలు సిసలైన జబ్బు

అందుకే హుషార్,మరపు మంచిది
కాదు, దానికి ధ్యానమే ఔషధం !!!
మరుపు జోలికి పోకు మానవా
కడగండ్లపాలు,నవ్వుల పాలు బ్రతుకు !

భగవంతుని దీవెన జీవితం
బ్రతుకును బ్రతికించు దివ్యం గా
ఆ పరమాత్ముని నమ్మి
అపుడే వెలుగు భవిత !!!

కామెంట్‌లు