వర్షం తో బాగా తడిసి ఇంటికి వచ్చారు పిల్లలు. "బడి గదుల్లోకి వర్షపునీరంతా చేరింది.అందుకే లంచ్ టైం కి పంపారు" అని గబగబా లంచ్ బాక్స్ తీయబోతుంటే బామ్మ అరిచింది "ముందు తడి బట్టలు వదిలి పొడివి వేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి అప్పుడు తినండి. కోవిడ్ టైం లో జాగ్రత్తలు పాటించారు.అన్నంతినేప్పుడు కూడా సకారాత్మకంగా ఆలోచిస్తూ తినాలి. శరీరం దేవాలయం. మనంతినేప్పుడు సణుగుడు వంటకాలకి వంకలు పెడుతూ తినరాదు.నైవేద్యం పెడుతున్న భావంతో సంతోషంగా తినాలి.పూర్వం చక్కగా నేలపై విస్తరి వేసుకుని పీట మీద కూచుని తినటంవల్ల ఆరోగ్యం గా ఉండేవారు. చేతివేళ్లతోనే తినాలి. అందుకే వంట చేసేప్పుడు నేను రేడియో లో భక్తి పాటలు వింటూ చేస్తా." బామ్మ తాత హితబోధ తో పిల్లలు ఆచరణలో పెట్టారు 🌷
సకారాత్మకంగా! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి