1997 దాకా జీవించిన తురగా కృష్ణమూర్తి గారి గురించి ఈపుస్తకం ద్వారా తెలుసుకున్నాను.చరిత్ర విద్యాధర కృష్ణమూర్తి గారు 1.11.1911లో పుట్టారు.కాకినాడలో ప్రాధమిక విద్య గుంటూరు ఎ.సి.కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు.కాకినాడలో పిఠాపురం రాజా వారి కళాశాల లో గణితం లో బి.ఎ.పాసైనారు.భారతిలో ఆయన రచనలు పుంఖానుపుంఖాలుగా వెలువడినాయి.చారిత్రకపరిశోధనలు చేసి సర్వశ్రీ రాళ్లబండి కృష్ణారావు గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు మొదలైన వారి ప్రశంసలు పొందారు.రెడ్డి యుగమున ఆంధ్ర గీర్వాణ సాహిత్య వికాసం శ్రీ భీమేశ్వరాలయశాసన మణిమంజూష చెప్పుకోతగ్గ రచనలు.400పైగా శాసనాల్ని శోధించి చారిత్రక సత్యాలను వెలికి తీసిన ఘనులు.కానీ మరుగున పడిన మాణిక్యంగా
చరిత్రలో మిగిలారు.ఈయన శ్రీమతి మాణిక్యాంబ గారు.ముగ్గురు అబ్బాయిలు నలుగురు కుమార్తెలు.పెద్ద అల్లుడు బంధకవి సీతారామాంజనేయులు గారు ప్రముఖ న్యాయవాది.ఆయనశివ చిదానంద భారతి స్వామి గా కుర్తాళం పీఠాధిపతి అయినారు.ఆయన తర్వాత ఇప్పటి పీఠాధిపతి అందరికీ సుపరిచితులు.🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి