నాన్నతో నా అనుబంధం
నాన్నతో నేను అంటే కొంచెం భయంగానే ఉండేది. కాకపోతే నాన్న చాలాసార్లు మాట్లాడే పద్ధతి ఆ సమయానికి తగినట్టుగా కాక కటువుగా ఉన్నట్టు అనిపించినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ నాన్న చేసిన అంచనా కరెక్ట్ అయ్యేది. ఈ విషయం చాలాసార్లు ఋజువైయ్యింది.
నాన్నని ఇష్టపడేవాళ్ళ సంఖ్య తేల్చడం కష్టమైన పని. నాన్న మాట సూటిగా ఉన్నా అంతమంది సన్నిహితంగా ఎలా ఉండేవారంటే ఎవరికైనా ఏదైనా పని అవసరమైనప్పుడు నాన్న చూపించే నిబద్ధత అని చెప్పాలి.ఈ ఇతరులకి పని చేసే విషయంలో అమ్మా నాన్నా ఒకరిని మించి ఒకళ్ళుండేవాళ్ళు.
ముందుగా నాన్నతో నేను....ఈ విషయానికి వస్తే స్కూల్లో ఐదవ తరగతి దాకా క్రమంగా స్కూల్ కి వెళ్లిన సందర్భాలు నాకు సరిగ్గా గుర్తుకులేవు. నేనే కాదు అప్పుడు అందరికీ అంతే. అప్పట్లో మాకుటుంబం ఇప్పటి కామారెడ్డి జిల్లా.. రామారెడ్డి,సదాశివనగర్ మధ్య ఫుట్ బాల్ లాగా ఉంటుండే.
నా స్కూల్ జీవితంలో నాన్న ఏడవ తరగతి నుంచి తొమ్మిది దాకా తెలుగు చెప్పేది. నాన్న చెప్పే పాఠాలు అంత జనరంజకంగా ఉండకపోయినా పరీక్షలకు తగినట్లుగా ఉండేది. ఈ పాఠాలు బోధించే విషయంలో ఎట్లున్న నాన్న ఏ స్కూల్లో పనిచేసినా నాన్నని చూసి భయపడే వాళ్ల సంఖ్య ఎక్కువే ఉండేది. ఆ భయంతోనే ఒక రకమైన పెద్దరికంతో, గౌరవంతో నాన్నని సలహాలు అడగడంలో అందరూ ముందుండేవారు. తగని పని చేసేవాళ్ళు నాన్నకి ఎదురుపడాలంటే ఖచ్చితంగా ఆలోచించేవాళ్ళు.
స్కూల్ పిల్లలమధ్య ఏవన్న చిన్న గొడవలు పెద్దగా అయినప్పుడు హెడ్ మాస్టర్ కూడా నాన్నని ఆ సమస్యల్ని డీల్ చేసి సెట్ చెయ్యమనేది.ఇంక చుట్టాల్లో అయితే దాదాపు అందరూ అంటే అమ్మ తల్లిగారివైపు,నాన్న వైపు వాళ్ళందరూ పెళ్ళిళ్లు ఇంకా ఏ శుభాశుభ కార్యాలకైనా నాన్నని సలహా అడగడమే కాక ఆ టైం నాన్న ఉండాలనే బలంగా కోరుకునేది.నాన్న కూడా స్కూల్ టైం కాకుండా మిగతా టైం లో వెళ్లి చాలా పనులు ఒక గాడిలో పెట్టి వస్తుండేది. నాన్నతో నేను 1963 నుంచి నాన్న క్యాన్సర్ తో 2010 లో చనిపోయేవరకు నా సుఖదుఃఖాలన్నిటిని చెప్పేదాన్ని.అమ్మతో ఎవరికైనా ఎమోషనల్గానే ఉంటుంది బంధం.కానీ నాన్నతో బరువుని పంచుకొనే బాధ్యతతో ఉంటుందని నాకెన్నోసార్లు నిరూపితమైంది.తండ్రి రక్షణ పిల్లలకి ఒక విలువకట్టలేని ఆస్తి అనచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి